29, సెప్టెంబర్ 2011, గురువారం

కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన సచిన్


AA

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు. బాంద్రాలోని పెర్రీ క్రాస్‌ రోడ్‌లో తాను కట్టించుకున్న భవనంలోకి ఇవాళ గృహప్రవేశం చేశాడు. ఈ స్థలం 2007లోనే కొన్నప్పటకీ మాస్టర్ అభిరుచికి అనుగుణంగా డిజైన్ చేసేందుకు నాలుగేళ్ళు పట్టింది. పూర్తిగా అత్యాధునిక వసతులతో పాటు పలు ప్రత్యేకతలు కలిగిన ఈ ఇంటి విలువ 80 కోట్ల రూపాయలు. కాగా కొత్త ఇంట్లోకి మారడం చాలా ఉద్వేగంగా ఉందని సచిన్ చెప్పాడు. సచిన్ గృహప్రవేశం సందర్భంగా చుట్టుపక్క వారు అతనికి విషెస్ చెప్పేందుకు ఎగబడ్డారు.

చైనాలో గోల్డ్ వెండింగ్ మిషన్లు


AA

* బంగారం కొనుగోళ్ల ప్రోత్సాహం కోసం
* బీజింగ్ మొదటి గోల్డ్ వెండింగ్ మిషన్
* అందుబాటులో కాయిన్స్ నుంచి గోల్డ్ బార్స్ వరకూ
* చైనాలో పుత్తడికి పెరిగిన డిమాండ్
* బంగారంపై పెట్టుబడి కోసం...
* బంగారం వినియోగంలో భారతీయులే టాప్


మనం బంగారం కొనాలంటే షాపుకెళ్లాలి. బేరమాడాలి. క్వాలిటీ చూడాలి. ఇలా చాలా పెద్ద తతంగం ఉంటుంది. కానీ, చైనావాళ్లకు ఇప్పుడా బాధ లేదు. ఎంచక్కా ఏటీఎమ్ లో డబ్బులు తీసుకున్నట్టే గోల్డ్ ను డ్రా చేసుకోవచ్చు. అదీ కేజీల్లో కూడా హాయిగా కొనుక్కోవచ్చు. కార్డ్ ఆర్ క్యాష్ ఏదిచ్చినా పుత్తడి మీదవుతుంది. అదెలా అంటారా! మీరే చూడండి.
పండగలకు, పబ్బాలకు బంగారాన్ని కొనడం చాలామంది సెంటిమెంటు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట కొలువుంటుందని నమ్ముతారు. కానీ, దాన్ని కొనాలంటే కాస్త ఇబ్బందే. ఇప్పుడా బాధ లేదు. బంగారం కొనాలంటే సింపుల్ గా గోల్డ్ వెండింగ్ మిషన్ దగ్గరకు వెళ్లడం.. తెచ్చుకోవడం. ఇంతే. ప్రస్తుతానికి ఈ సదుపాయం మనదగ్గర లేదు కాని.. చైనాలో వచ్చేసింది. అవును. బీజింగ్ లో ఫస్ట్ టైమ్ గోల్డ్ వెండింగ్ మిషన్ ను ఏర్పాటు చేశారు.
ఇండియా తరువాత బులియన్ మార్కెట్లో చైనాదే స్థానం. అందుకే బంగారం కొనుగోలును ప్రోత్సహించడానికి నిర్ణయించుకుంది చైనా. బీజింగ్ లో వాంగ్ ఫూజింగ్ షాపింగ్ డిస్ట్రిక్ట్ లో దీన్ని ఏర్పాటు చేశారు. క్యాష్ కాని, బ్యాంకు కార్డులు ఉపయోగించి.. ఈ గోల్డ్ బార్ లను కొనుక్కోవచ్చు. ప్రజల సౌలభ్యం కోసం కాయిన్స్ నుంచి గోల్డ్ బార్స్ వరకూ వెండింగ్ మిషన్ లో ఉంటాయి.
ఒక విత్ డ్రాలో అత్యధికంగా రెండున్నర కేజీలను డ్రా చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఇలాంటి మెషీన్ లు ఏర్పాటు చేయడానికి చైనా రెడీ అయింది. చైనాలో కిందటేడాదితో పోలిస్తే ఈ ఏడాది పుత్తడి డిమాండ్ 27శాతం పెరిగింది. దేశంలో ప్రాపర్టీ ధరలను కంట్రోల్ చేయడానికి, అనవసరమైన స్పెక్యులేషన్ నివారించడానికి, బంగారం మీద పెట్టుబడిని ఆకర్షణీయంగా మార్చడానికి వీటిని ఏర్పాటు చేసింది.
భారతీయులతో పోల్చితే... చైనీస్ బంగారం కొనుగోళ్లు ఇప్పటికీ తక్కువే. గత ఏడాది మనం 963.1 టన్నులు కొంటే, చైనావాళ్లు 579.5 టన్నులే కొన్నారు. గోల్డ్ వెండింగ్ మిషన్ లు ఇప్పటికే బ్రిటన్, అమెరికా, యూరప్ దేశాల్లో ఉన్నాయి.

ఐశ్వర్యరాయ్‌కి కవలలు!


AA

* ట్విన్స్‌ పుట్టే ఛాన్సుందంటున్న ఫ్యామిలీ ఫ్రెండ్స్‌
* సంతోషంలో బచ్చన్‌ ఫ్యామిలీ


అందాల సుందరి ఐశ్వర్యారాయ్‌కి కవలలు జన్మించనున్నారా ? అవునని బచ్చన్‌ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ చెబుతున్నారు. జ్యోతిష్యులదీ ఇదే మాటనీ ఫ్యాన్స్‌ అంటున్నారు. అదే నిజమైతే బచ్చన్స్‌ కుటుంబంలో సందడే సందడి. ఐశ్వర్యారాయ్‌కి మగబిడ్డ పుడుతుందా లేక ఆడపిల్ల జన్మిస్తుందా ? ఐశ్వర్య ప్రెగ్నెన్సీకన్‌ఫర్మ్‌ అయినప్పటి నుంచి ఫ్యాన్స్‌తోపాటు సామాన్యుల్లోనూ ఇవే ఆలోచనలు.
అయితే, ఇప్పుడు ఐష్‌కు ట్విన్స్‌ జన్మించబోతున్నారన్న వార్తలు హాట్‌ టాపిక్‌గా మారాయి. నవంబర్‌లో ఐశ్వర్య డెలివరీ ఉంటుందని చెబుతున్న ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ పుట్టబోయేది కవలలే అని అంటున్నారు. అయితే, ఇదంతా తమ పర్సనల్‌ అని అంటున్నారు. అటు కొందరు జ్యోతిష్యులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ట్విన్స్‌ పుట్టబోతున్నారంటూ వస్తున్న వార్తలపై అమితాబ్‌ ఫ్యామిలీ సంతోషంగా ఉన్నట్లు సమాచారం.

అయితే, అభిమానుల్లో ఇప్పుడు మరో సందేహం మొదలైంది. ట్విన్స్‌ అంటే ఇద్దరూ ఆడపిల్లలు పుడతారా లేక మగపిల్లలా లేక ఒకరు ఆడ, మరొకరు మగ శిశువులు జన్మిస్తారా అని ఆలోచిస్తున్నారు. అదే సమయంలో ఐష్‌ దంపతులకు ఆడ, మగ పిల్లల్లో ఎవరంటే ఇష్టం అనే దానిపై డిస్కషన్స్‌ జరుపుతున్నారు.

లైపోసెక్షన్‌ వల్ల అందంతో పాటు ఆరోగ్యం

లైపోసెక్షన్‌ వల్ల అందంతో పాటు ఆరోగ్యం
AA

* గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువ
* లైపోసెక్షన్‌కు క్యూ కడుతున్న ఊబకాయులు


ప్రపంచవ్యాప్తంగా అందరినీ వేధిస్తున్న సమస్య స్థూలకాయం. అయితే ఈ అనారోగ్య సమస్య నుంచి బైటపడేందుకు కొందరు వ్యాయామాలు చేస్తే...మరికొందరు ఊబకాయులు స్లిమ్‌గా కనిపించేందుకు డాక్టర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. లైపోసెక్షన్ ద్వారా శరీరంలో పేరుకుపోయి కొవ్వు నిల్వలు తీయించుకుంటున్నారు.

ఇలా శస్త్ర చికిత్స ద్వారా ఫేట్ కరిగించుకుంటే హెల్త్‌కు లాభామా?నష్టమా అన్నది ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న డౌట్. లైపోసెక్షన్స్‌ వల్ల ఆరోగ్యానికి నష్టమే కాదు...లాభాలు కూడా ఉన్నాయని ఓ పరిశోధనలో తేలింది. ముఖ్యంగా ఈ శస్త్ర చికిత్స ద్వారా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలు తీయించుకుంటే గుండెకు మేలు చేస్తుందట. హార్ట్ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం చాలా తక్కువంటున్నారు డాక్టర్లు.

లైపోసెక్షన్ వల్ల రక్తంలో ఉండే ట్రిగ్లిసిరైడ్ లైవల్స్ 43శాతానికి పడిపోతాయట. దీంతో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం చాలా తక్కువని అమెరికన్ సొసైటీ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్స్ పరిశోధనలో తేలింది. మొత్తం 322 మంది పేషెంట్లపై స్టడీ చేసిన డాక్టర్లు ఈ విషయాన్ని వెల్లడించారు. లైపోసెక్షన్ వల్ల అన్నీ లాభాలే అనుకోకండి...నష్టాలు కూడా ఉన్నాయి.
అందుకే నిపుణుల పర్యవేక్షణలో ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార నియమాలు పాటించడంతో పాటు...శారీరక వ్యాయామం చేస్తే మంచిది.