29, సెప్టెంబర్ 2011, గురువారం

లైపోసెక్షన్‌ వల్ల అందంతో పాటు ఆరోగ్యం

లైపోసెక్షన్‌ వల్ల అందంతో పాటు ఆరోగ్యం
AA

* గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువ
* లైపోసెక్షన్‌కు క్యూ కడుతున్న ఊబకాయులు


ప్రపంచవ్యాప్తంగా అందరినీ వేధిస్తున్న సమస్య స్థూలకాయం. అయితే ఈ అనారోగ్య సమస్య నుంచి బైటపడేందుకు కొందరు వ్యాయామాలు చేస్తే...మరికొందరు ఊబకాయులు స్లిమ్‌గా కనిపించేందుకు డాక్టర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. లైపోసెక్షన్ ద్వారా శరీరంలో పేరుకుపోయి కొవ్వు నిల్వలు తీయించుకుంటున్నారు.

ఇలా శస్త్ర చికిత్స ద్వారా ఫేట్ కరిగించుకుంటే హెల్త్‌కు లాభామా?నష్టమా అన్నది ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న డౌట్. లైపోసెక్షన్స్‌ వల్ల ఆరోగ్యానికి నష్టమే కాదు...లాభాలు కూడా ఉన్నాయని ఓ పరిశోధనలో తేలింది. ముఖ్యంగా ఈ శస్త్ర చికిత్స ద్వారా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలు తీయించుకుంటే గుండెకు మేలు చేస్తుందట. హార్ట్ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం చాలా తక్కువంటున్నారు డాక్టర్లు.

లైపోసెక్షన్ వల్ల రక్తంలో ఉండే ట్రిగ్లిసిరైడ్ లైవల్స్ 43శాతానికి పడిపోతాయట. దీంతో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం చాలా తక్కువని అమెరికన్ సొసైటీ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్స్ పరిశోధనలో తేలింది. మొత్తం 322 మంది పేషెంట్లపై స్టడీ చేసిన డాక్టర్లు ఈ విషయాన్ని వెల్లడించారు. లైపోసెక్షన్ వల్ల అన్నీ లాభాలే అనుకోకండి...నష్టాలు కూడా ఉన్నాయి.
అందుకే నిపుణుల పర్యవేక్షణలో ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార నియమాలు పాటించడంతో పాటు...శారీరక వ్యాయామం చేస్తే మంచిది.