![]() * ట్విన్స్ పుట్టే ఛాన్సుందంటున్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ * సంతోషంలో బచ్చన్ ఫ్యామిలీ అందాల సుందరి ఐశ్వర్యారాయ్‌కి కవలలు జన్మించనున్నారా ? అవునని బచ్చన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ చెబుతున్నారు. జ్యోతిష్యులదీ ఇదే మాటనీ ఫ్యాన్స్ అంటున్నారు. అదే నిజమైతే బచ్చన్స్ కుటుంబంలో సందడే సందడి. ఐశ్వర్యారాయ్‌కి మగబిడ్డ పుడుతుందా లేక ఆడపిల్ల జన్మిస్తుందా ? ఐశ్వర్య ప్రెగ్నెన్సీకన్‌ఫర్మ్ అయినప్పటి నుంచి ఫ్యాన్స్‌తోపాటు సామాన్యుల్లోనూ ఇవే ఆలోచనలు. అయితే, ఇప్పుడు ఐష్‌కు ట్విన్స్ జన్మించబోతున్నారన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. నవంబర్‌లో ఐశ్వర్య డెలివరీ ఉంటుందని చెబుతున్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ పుట్టబోయేది కవలలే అని అంటున్నారు. అయితే, ఇదంతా తమ పర్సనల్ అని అంటున్నారు. అటు కొందరు జ్యోతిష్యులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ట్విన్స్ పుట్టబోతున్నారంటూ వస్తున్న వార్తలపై అమితాబ్ ఫ్యామిలీ సంతోషంగా ఉన్నట్లు సమాచారం. అయితే, అభిమానుల్లో ఇప్పుడు మరో సందేహం మొదలైంది. ట్విన్స్ అంటే ఇద్దరూ ఆడపిల్లలు పుడతారా లేక మగపిల్లలా లేక ఒకరు ఆడ, మరొకరు మగ శిశువులు జన్మిస్తారా అని ఆలోచిస్తున్నారు. అదే సమయంలో ఐష్ దంపతులకు ఆడ, మగ పిల్లల్లో ఎవరంటే ఇష్టం అనే దానిపై డిస్కషన్స్ జరుపుతున్నారు. |