24, అక్టోబర్ 2011, సోమవారం

ఢిల్లీహైకోర్టు పేలుడు కేసు

కీలకంగా 'డాక్టర్‌ జిహాద్‌' :ఎన్‌ఐఎఢిల్లీ హైకోర్టు బాంబు పేలుడు కేసులో కాశ్మీర్‌కు చెందిన వైద్య విద్యార్ధి వాసిమ్‌ అహ్మద్‌ మాలిక్‌ని కీలకంగా జాతీయ భద్రత సంస్థ (ఎన్‌ఐఎ) భావిస్తోంది. ఈకీలక వ్యక్తినే 'డాక్టర్‌ జిహాద్‌'గా ఎన్‌ఐఎ వ్యవహరిస్తోంది. సెప్టెంబరు ఏడున మధ్యాహ్నం 1.45గటలకు ఢిల్లీ కోర్టులోపల నుంచి ఐదు కిలోల పేలుడు వస్తువులతో కూడిన ప్లాస్టిక్‌ ప్యాకింగును మోసుకుని బ్రీఫ్‌ కేసు బయలకు వెళ్లే సమయానికి పేలుడు సంభవించిన 583కి.మీ. దూరంలోని జమ్ములో బ్యాంకు ఎటిఎం యంత్రం దగ్గర వాసిమ్‌ నగదు తీసుకోవడానికి వెళ్లినట్లుగా అక్కడ అమర్చిన సిసి కెమెరాలు రికార్డు చేశాయి. 15మంది మృతికి దారి తీసిన నాటి పేలుడుకు సమీపంలో వాసిమ్‌ లేనప్పటికీ పేలుడు కుట్రలో కీలక పాత్రధారి వాసిమేనని ఎన్‌ఐఎ బలంగా నమ్ముతోంది. బంగ్లాదేశ్‌లోని వైద్యకళాశాలలో చదివే ఇతర ఇస్లామిస్ట్‌ తీవ్రవాదులతో కలసి దాడులకు పాల్పడుతున్నట్లు అభిప్రాయపడుతోంది. ఇందుకు పాకిస్తాన్‌లోని జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ నుంచి సాయం తీసుకుంటూ జమ్ముకాశ్మీర్‌లోని కిష్ట్వారలో టీనేజర్లను తమ ముఠాలోకి చేర్చుకుంటున్నారనేది ఎన్‌ఐఎ కధనం. ఈకధనాన్ని వాసిమ్‌ మాలిక్‌ కుటుంబ సభ్యులు ఖండిస్తున్నారు. ఎన్‌ఎఐ దర్యాప్తులోని వివరాలు సక్రమమని తేలితే ఒక వ్యవస్థగా కాక ఆలోచన ప్రేరేపణతో యువకులు ఉగ్రవాద దాడులకు పాల్పడుతున్నారని తేలిపోతుంది