24, అక్టోబర్ 2011, సోమవారం

తమిళనాడు స్థానిక ఎన్నికల్లో 102 ఏళ్ల దళిత మహిళ ఘన విజయం

చెన్నయ్: తమిళనాడులో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 102 ఏళ్ల దళిత మహిళ తడగతి ఘన విజయం సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కొద్ది రోజుల క్రితమే ఫౌజాసింగ్‌ అనే భారత సంతతి వ్యక్తి శతవసంతాలు పూర్తి చేసిన వ్యక్తిగా రికార్డులకెక్కగా ఇప్పుడు తడగతి ఆ రికార్డులను తిరగరాసి ఏకంగా స్థానిక సంస్థల సభ్యురాలిగా ఎన్నికైంది. చెన్నయ్ కి 450 కి.మీ దక్షిణాన వున్న మదురై జిల్లా పుదుకులం పంచాయితీ వార్డు సభ్యురాలిగా ఈ దళిత మహిళ ఎన్నికైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. స్థానిక సంస్థలకు ఎన్నికైన వారిలో ఈమె అత్యధిక వయస్కురాలని కమిషన్‌ వివరించింది. 'మరుతువాచ్చి (ఆయుర్వేద డాక్టర్‌) అని స్తానికులు ఆప్యాయంగా పిలుచుకునే తడగతి గతంలో నర్స్‌గా పనిచేసిందని, ఆమె తన చేతులతో దాదాపు వెయ్యిమంది శిశువులకు జన్మనిచ్చిందని పంచాయితీ సర్పంచ్‌ పి ముత్తురామలింగం చెప్పారు.