- డా. చిరుమామిళ్ల మురళీమనోహర్
దీపావళి పండుగ అంటే అందరికీ సరదా. ఆయుర్వేద వైద్య శాస్త్రంలో పంచ జ్ఞానేంద్రియాలను సమర్థవంతంగా వినియోగించుకునే ప్రక్రియలను గురించి చెప్పారు. ఈ జ్ఞానేంద్రియాలను సరైన రీతిలో వినియోగించుకుంటే శారీరక, మానసిక స్వార్థ్యం సిద్ధిస్తుంది. వివిధ పండుగల్లో మనం జరుపుకునే వేడుకల్లో అంతర్లీనంగా ఇదే ఉద్దేశం కనిపిస్తుంది.దీపావళి పండుగ అనేది వర్షాకాలపు చివరి రోజుల్లో, చలికాలపు ప్రారంభపు దినాల్లో వస్తుంది. దీపావళి పర్వదినం జరుపుకోవడంలో ప్రధాన వైద్యపరమైన ఉద్దేశం గాలిని పరిశుద్ధం చేయటమే కాకుండా సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ లాంటి మనోసంబంధమైన రుగ్మతల బారిన పడనివ్వకుండా చేయటం. రుతు సంధి రోజుల్లో వర్షాంతపు కాలంలో భూమిలో క్రిమికీటకాలు పుడుతుంటాయి. దీపావళి సందర్భంగా పెద్దనేపాళపు గింజలు పుల్లకుగుచ్చి వెలిగించటం, జనపకట్టె కట్టలు వెలిగించటం వంటివాటివల్ల క్రిమికీటకాలు అదుపులో ఉంటాయి. ఇక చప్పుడు చేసే టపాకాయలవల్ల ఉదాసీనత, నిర్లిప్తత దూరమవుతాయి. మహాలయ పక్షంలో స్వర్గంనుంచి దిగి వచ్చి భూలోకంలో సంచరించే పితృదేవతలు దీపావళిన తిరిగి ప్రయాణమై వెళ్లేటప్పుడు, వారికి వెలుతురు చూపే నిమిత్తం భూలోకవాసులు చేతులతో కాగితాలు పట్టుకొని ఆకాశంవైపు చూపాలని శాస్తవ్రచనం. ఇది మన నమ్మకం. ఇదే ఆచారం కాలక్రమంలో మతాబుగా మారింది. అయితే అనేక సందర్భాల్లో ఈ ప్రధాన ఉద్దేశాలు తప్పుదారిపట్టి అవాంఛనీయమైన ఇక్కట్లు కలగటం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో దీపావళి రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, దీపావళి ప్రమాదాలను ఎదుర్కొనే పద్ధతుల గురించీ, ఆయుర్వేద గృహచికిత్సల గురించి వివరంగా ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం.
సాధారణ జాగ్రత్తలు..
దీపావళి సందర్భంగా పిల్లలు, పెద్దలు పోటీలుపడి టపాకాయలను కాలుస్తుంటారు. కొందరు టపాకాయలను కాల్చేటప్పుడు సాహస కార్యాలు చేసి తమ శరీరానికి హాని కలిగే విధంగా చేసుకుంటారు. చాలామందికి శరీరం కాలడం, గాయాలుకావడం అందరికీ విదితమే.
టపాకాయలను వీలైనంతవరకూ బైటి ప్రదేశాలలోనే కాల్చాలి. కాల్చే వ్యక్తులు, చుట్టుప్రక్కలవారు వీలైనంత వరకూ నేత బట్టలు ధరిస్తే మంచిది. అప్పుడు నిప్పురవ్వలు పైనపడినా ఒళ్ళు కాలదు. ఎంత చిన్న టపాకాయ అయినా చేతిలో పేలే విధంగా కాల్చకూడదు. శక్తివంతమైన బాంబులను, అవుట్లను కాల్చేప్పుడు వాటిని ఇసుకలో కాని మట్టిలో కాని నిలబెట్టి పొడవైన కర్ర లేదా పొడవాటి తీగ సహాయంతో నిప్పు అంటిస్తే మంచిది. అంటించిన వెంటనే పేలడం లేదని వాటిని చేతిలోకి తీసుకుని పరీక్షించకూడదు.
చాలామంది చిచ్చుబుడ్లను ప్రమాద రహితంగా భావించి చేతులలో ఉంచుకుని కాలుస్తారు. కాని ఒక్కొక్కసారి దానికి అడుగున రంధ్రం పడి, చేతులు కాలే ప్రమాదముందని గ్రహించాలి. లేదా అది ఒక్కొక్కసారి పేలిపోవచ్చు. ప్రతి ఒక్కరూ చెప్పులు తప్పనిసరిగా ధరించాలి. కొందరు బాగా శబ్దం వస్తుందని టపాకాయలను డబ్బాలలో వేసి కాలుస్తారు. అలా కాలుస్తున్నప్పుడు కొన్నిసార్లు డబ్బా ముక్కలై చుట్టుప్రక్కల ఉన్నవారి దేహాలలోకి చొచ్చుకుపోయే ప్రమాదముంది.
చిన్న పిల్లలు కాకరపువ్వులు ఎక్కువగా కాలుస్తూ సరదాకోసం పూలను ఒకరిపై మరొకరు విసురుతుంటారు. ఒక్కొక్కసారి నిప్పు రవ్వలు కంటిలో పడి కళ్ళు దెబ్బతినే ప్రమాదముంది. కనుక పెద్దలు దగ్గరుండి హెచ్చరిస్తూ మాత్రమే పిల్లలచేత టపాకాయలను కాల్పించాలి. వీటిని కాల్చిన తరువాత కాకరపువ్వొత్తి కాడలను అన్నిటినీ చెల్లాచెదురుగా పడేయకుండా ఒక దగ్గర జాగ్రత్తచేయాలి. గుడిసెలు, పూరిళ్ల దగ్గర తారాజువ్వలను కాల్చకూడదు. పెద్ద శబ్దాలు వచ్చే బాంబులవలన చిన్న పిల్లలకు చెవులు దెబ్బతిని శాశ్వతంగా చెవుడు వచ్చే అవకాశముందని గుర్తుంచుకోవాలి. ఇలా జరగకుండా ఉండాలంటే చెవుల్లో దూది పెట్టుకోవాలి.
టపాకాయలను తెచ్చుకునేప్పుడు వీలైనంతవరకూ వాటిని సూట్‌కేస్ లాంటి గట్టి వాటిలో తేవాలి. అలాగే వాటిని ఇంటిలో వంట గదికి దూరంగా వేడి తగలనిచోట ఉంచుకోవాలి. ఒకవేళ ప్రమాదవశాత్తూ బట్టలకు నిప్పంటుకుంటే భయపడి పరుగెత్తకూడదు. అలాచేస్తే మంట ఇంకా ఎక్కువవుతుంది. కనుక వెంటనే మందమైన దుప్పటిని ఒంటినిండా కప్పి కింద దొర్లిస్తే మంటలు ఆరిపోతాయి.
గృహ వైద్యం..
కాలిన గాయాలను ఆయుర్వేదం నాలుగు రకాలుగా వర్ణిస్తుంది.
1. మొదటి రకం అతి స్వల్పగాయాలు. ఇలాంటి దగ్ధవ్రణాలను ప్లుష్టం అంటారు. చర్మం రంగు మారి కేవలం కమిలినట్లు కనిపించటం ఈ తరహా గాయాల ప్రధాన లక్షణం. ఈ రకం అగ్నిదగ్ధస్థితి కనిపిస్తే కొద్దిగా కాపడం పెట్టాలి. చన్నీళ్లు ప్రయోగిస్తే రక్తం గడ్డకట్టి నొప్పి మరింత పెరుగుతుంది కనుక ఈ స్థితిలో రక్తప్రసరణ పెంచడానికి సుఖోప్నంగా కాపడం పెడితే సరిపోతుంది. లేదా కొద్దిగా వేడిచేసిన కొబ్బరి నూనెను కూడా ప్రయోగించవచ్చు.
2. రెండవ రకం దుర్దగ్ధం. కాలినచోట చిన్నచిన్న నీటి బొడిపెలు తయారవుతాయి. దీనిలో ముందు శీతల చర్యలు చేసి, ఆ తరువాత ఉష్ణప్రక్రియలు అవలంబించాలి.
3. మూడవ రకం సమ్యక్‌దగ్ధం. దీనిలో చుట్టూ ఉన్న చర్మం ఎండిన ఖర్జూరం రంగులో కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో వెదురుప్పు (వంశలోచనం), ఎర్ర చందనం, స్వర్ణగైరికం, తిప్పసత్తులను మెత్తగా పొడిచేసి, నెయ్యి కలిపి బాహ్యంగా ప్రయోగించాలి.
4. నాలుగవ రకం అతి దగ్ధం. దీనిలో చర్మం బాగా కాలిపోవటమే కాకుండా సంబంధిత ప్రాంతంలోని ఇతర భాగాలు కూడా దెబ్బతింటాయి. ఇలాంటి సందర్భాల్లో కాలి దెబ్బతిన్న మాంస ఖండాలను జాగ్రత్తగా తొలగించి, శీతల చర్యలు చేపట్టాలి. బియ్యం పిండిలో మంచి గంధంపొడి కలిపి బాహ్యంగా ప్రయోగించాలి.
ఆయుర్వేద ప్రథమ చికిత్సలు
* మంటలవల్ల గాయమైతే చల్లని నీటిలో కాలిన భాగాన్ని ఉంచాలి. మంచుముక్కలను గుడ్డలోచుట్టి స్థానికంగా ప్రయోగిస్తే మంట పుట్టకుండా, వాపు తయారుకాకుండా ఉంటుంది. లేదా చన్నీళ్లలో స్వచ్ఛమైన నూలుగుడ్డను తడిపి గాయంమీద ప్రయోగించాలి.
* కళ్లలో నిప్పురవ్వలు పడితే వెంటనే కళ్లలో చన్నీళ్లు చిలకరించాలి. రసాయనాలు పడితే అయిదు నిమిషాలపాటు చన్నీళ్లతో కళ్లను కడగాలి. లేదా చన్నీళ్లలో కళ్లను తెరిచి ఉంచాలి. తరువాత ఆవునెయ్యిని గాని, స్వచ్ఛమైన ఆవుపాలను గాని కళ్లలో డ్రాప్స్‌గా వేసుకోవాలి.
* కాలిన గాయాలపైన కలబంద (ఘృతకుమారి) రసాన్ని పూస్తే మచ్చ పడకుండా మానతాయి.
* దోసకాయ గుజ్జు, పచ్చి బంగాళ దుంప గుజ్జు, క్యారెట్ గుజ్జు, అరటి పండు గుజ్జు వంటివి కాలిన గాయంమీద ప్రయోగించి, పైన గాజు గుడ్డను చుడితే మంచి ఫలితం కనిపిస్తుంది.
* అతసీ తైలం (లిన్‌సీడ్ ఆయిల్)ను తేనెతోకలిపి రాస్తే కాలిన గాయాల్లో మంచి ఫలితం కనిపిస్తుంది.
* సన్నపు తేట (చూర్ణోదకం) ఒక భాగం, అతసీ తైలం మూడు భాగాలు కలిపి పైపూతగా రాస్తే కాలిన గాయాలు తగ్గుతాయి.
* నువ్వుల నూనె, కొబ్బరినూనె కలిపి రాస్తే కాలిన గాయాలు త్వరితగతిన మానతాయి.
* కాలిన ప్రదేశంలో తేనెను ప్రయోగించవచ్చు.
* చెంచాడు వంట సోడాను ఒక కప్పు నీళ్లకు కలిపి స్థానికంగా ప్రయోగిస్తే మంట, నొప్పి వంటివి దూరమవుతాయి.
* కొబ్బరినూనె, సున్నపు తేట కలిపి, మలాం మాదిరిగా చేసి కాలిన గాయంమీద ప్రయోగించవచ్చు.
* నల్లతుమ్మ బంకను నీటిలో కలిపి పేస్టు మాదిరిగా చేసి స్థానికంగా ప్రయోగిస్తే హితకరంగా ఉంటుంది.
* వేపాకులు, నువ్వులు, తేనె కలిపి ముద్దగా నూలి కాలిన గాయం మీద ప్రయోగించాలి.
* కానుగ ఆకులు, వేపాకులు, వావిలి ఆకులు ముద్దగా నూరి కాలిన గాయం మీద ప్రయోగించాలి.
* ఇలా ప్రథమ చికిత్స చేసిన తరువాత గాయాల తీవ్రతనుబట్టి వైద్య సహాయం పొందాల్సి ఉంటుంది.
* రావిచెట్టు (అశ్వత్థ/పీపల్) మాను బెరడును ఎండబెట్టి,