1, అక్టోబర్ 2011, శనివారం

కలెక్షన్ల 'దూకుడు'

Sat, 1 Oct 2011, IST  
సూపర్‌స్టార్‌ మహేష్‌, హ్యాట్రిక్‌ డైరెక్టర్‌ శ్రీను వైట్ల కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై జి.రమేష్‌బాబు సమర్పణలో రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మించిన 'దూకుడు' (డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌) చిత్రం సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. మొదటి వారం రోజుల్లోనే ఈ చిత్రం 50 కోట్ల 7 లక్షలకుపైగా గ్రాస్‌, 35 కోట్ల ఒక లక్ష షేర్‌ సాధించి 80 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రను తిరగరాసిందని నిర్మాతలు అంటున్నారు. ఈ చిత్రం ఆంధ్ర ప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, నార్త్‌ ఇండియాలతోపాటు ఓవర్సీస్‌లో కూడా సంచలన విజయాన్ని సాధించి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. యు.ఎస్‌.లో లాస్‌ ఏంజిల్స్‌ టైమ్స్‌లో 'దూకుడు' చిత్రం సాధించిన అద్భుత విజయంపై స్పెషల్‌ ఆర్టికల్స్‌ రాయడం చూస్తే అక్కడ ఈ చిత్రం ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోందో తెలుస్తోంది.