అల్లరి నరేశ్ అంటేనే ఒక పేరుంది. అల్లరిలో చిల్లరిగా నటించి తనలోనూ నటుడున్నాడని నిరూపించుకున్నాడు. తనే రాజేంద్రప్రసాద్ లాంటి హీరోను అనుకరిస్తూ.. కామెడీ హీరో లేని లోటు తీర్చాలని చిన్నప్పటి నుంచి అనుకునేవాడినని చెప్పేవాడు. అలా తొట్టిగాంగ్, సిద్ధుఫ్రమ్ శీకాకుళంతో పాటు అనేక చిత్రాలు నటించి తనదైన సిల్లీ కామెడీతో బండి లాగించేస్తున్నాడు. ఏడాదికి ఎక్కువ చిత్రాలు తీస్తూ నిర్మాతల్ని, కార్మికులను ఆదుకుంటున్న నరేష్‌కు ఇప్పుడు పోటీ ఎదురవు తోందనే టాక్ ఫిలింనగర్‌లో వ్యాపించింది. మాస్ హీరోలని చెప్పుకునేవారు సైతం కామెడీతోనే సినిమాను గట్టేక్కేలా చేసేస్తున్నారు. అందుకే రచయితలు, దర్శకులు సినిమాల్లో కథ లేకపోయినా కామెడీ మీద కసరత్తు చేస్తున్నారు.
ఫలానా హీరో అని చెప్పేకంటే.. అందరూ ఆ వైపు దృష్టిసారిస్తున్నారు. గ్లామర్‌హీరోగా పేరుపొందిన మహేష్‌బాబు కూడా రెండేళ్లకుపైగా హిట్‌లేక అల్లాడుతుంటే.. శ్రీనువైట్ల కామెడీతో 'దూకుడు'తో గట్టెక్కించాడు. అల్లరి నరేష్ మాత్రం తన రొటీన్ తరహాలో నటిస్తూ 'మడతకాజా' తినిపిస్తానని చెప్పాడు. ఈమధ్య హీరోలంతా కామెడీవైపే మొగ్గుతున్నారు. మీకు పోటీగా భావిస్తున్నారా? అని అడిగితే.. ఏ ఆర్టిస్టుకైనా కామెడీ చేయడం చాలా కష్టం. నవసరాల్లో అది చాలా కీలకమైంది. సినిమాను ప్రేమించే వారెవరూ కామెడీ నచ్చదని చెప్పరు. అక్షరు కుమార్ లాంటి యాక్షన్ హీరోలు కూడా కామెడీతో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకోవడం చూస్తూనే వున్నాం. కామెడీచేసే హీరోలు సెంటిమెంట్ కూడా పండిస్తేనే సక్సెస్ అవుతారని చెప్పారు.