1, అక్టోబర్ 2011, శనివారం

4అధ్యాయాలు...45 పేజీలు

 తెలంగాణపై సోనియాకు ఆజాద్‌ నివేదిక
Sun, 2 Oct 2011, IST   
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌ శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షు రాలు సోనియాగాంధీని కలుసు కున్నారు. ముందుగా ప్రకటించిన ప్రకారం కీలక మైన 'తెలంగాణ' అంశంపై సోనియాకు ఆయన నివేదిక సమర్పిం చారు. ఈ అంశంపై రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులు అందరితో సంప్రదింపులు జరిపిన ఆజాద్‌ తన నివేదికను అంద జేశారు. రాష్ట్రం ఏర్పాటుపై త్వరితగతిన నిర్ణయం తీసుకో వాలని తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరిగిన నేప థ్యంలో సోనియాతో ఆయన సమావేశం ప్రాధాన్యతను సంత రించుకుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం డిమాండ్‌ చేస్తూ 15 రోజులుగా సమ్మె జరుగుతున్న నేప థ్యంలో తెలంగాణ ప్రాంతంలో పరిస్థితులను సోనియా గాంధీకి ఆజాద్‌ ఈ సమావేశంలో తెలియ జేశారు. ఆజాద్‌ ఇచ్చిన నివేదికలో 4 అధ్యాయాలు, 45 పేజీలున్నాయని అధి కార వర్గాలు వెల్లడించాయి. అమెరికా నుంచి సోనియాగాంధీ తిరిగి వచ్చిన తర్వాత తెలంగాణ అంశంపై గులాం నబీ ఆజాద్‌, సోనియాల మధ్య సమా వేశం జరగడం ఇదే ప్రథమం. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌పై రాష్ట్రం లోని మూడు ప్రాంతాలకు చెందిన పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలుతో సంప్రదింపులు జరిపిన ఆజాద్‌ శుక్రవారం నివే దికను సమర్పిస్తానని బుధవారమే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తెలంగాణ, రాయల సీమ, కోస్తాంధ్ర ప్రాంతాల నాయ కులతో సంప్రదింపులు జరపాలని, వారి అభిప్రాయాలను తెలుసు కోవాలని కాంగ్రెస్‌ అధిష్టానం ఆజాద్‌ను జులైలో కోరిన విషయం విదితమే. మూడు ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మె ల్యేల ప్రతినిధి బృందాలతో సంప్ర దింపుల క్రమాన్ని జులైలోనే ప్రారం భించిన ఆజాద్‌ దీనిని బుధవారంతో ముగించారు. ఈ సంప్రదింపుల్లో నాయకులు ప్రాంతాల వారీగా తమ వైఖరులను వినిపించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని తక్షణమే ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూ తెలం గాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. రాష్ట్రాన్ని విభజించాలనే వాదనను మిగతా రెండు ప్రాంతాల్లోని ప్రజా ప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు. సం ప్రదింపుల ప్రక్రియలో నాయకులు తమ వాదనలను రుజువు చేస్తూ డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌లతో పాటు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను ఇచ్చారు.