20, అక్టోబర్ 2011, గురువారం













సుప్రీంకోర్టులో జయకు చుక్కెదురు



















* బెంగళూరు కోర్టు విచారణకు హాజరుకావాలని ఆదేశం 
* ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నేడు విచారణ

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్ట్‌లో చుక్కెదురైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగుళూరు కోర్టుకు హాజరు కావాల్సిందేనంటూ తీర్పిచ్చింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణపై జయలలిత విచారణ ఎదుర్కొంటున్నారు.

అయితే... గత డీఎంకే హయాంలో తనకు న్యాయం జరగదని జయ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో... సుప్రీం కోర్ట్‌ కేసును బెంగళూరుకు బదిలీ చేసింది. అయితే తనకు భద్రత కల్పించడంలో కర్నాటక ప్రభుత్వం విఫలమైనందున విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని జయ కోర్టును అభ్యర్థించారు. జయ అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీం.. ఇవాళ విచారణకు రావాల్సిందేనని తేల్చిచెప్పింది.