23, అక్టోబర్ 2011, ఆదివారం

సంక్రాంతి లోపు జగన్ జైలుకెళ్లడం ఖాయం: దేవినేని
       విజయవాడ/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి లోపు జైలుకెళ్లడం ఖాయమని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దేవినేని ఉమా మహేశ్వర రావు ఆదివారం అన్నారు. ...ఇంకా మరిన్ని »

పోలవరం టెండర్ల పై పలు అనుమానాలు: పొన్నం
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ టెండర్లపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎలాంటి సమస్యలు, ఇబ్బందుల్లేని మిడ్ మానేరును ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయడలేదని ఆయన ప్రశ్నించారు. ...
వైయస్ ఆప్తుడే నమస్తే తెలంగాణ ఎండి: కడియం శ్రీహరిదట్స్ తెలుగు
పోలవరం టెండర్ ఖరారవ్వలేదుప్రజాశక్తి
పోలవరం టెండర్పై రాజకీయ దుమారంవిశాలాంధ్ర
TV5 -Vaartha Telugu news portal -తెలుగువన్
అన్ని 34 వార్తల కథనాలు »


గడాఫీ అంత్యక్రియలు జాప్యం
ట్రిపోలీ: తిరుగుబాటుదారుల కాల్పుల్లో మృతిచెందిన మొహమ్మద్ గడాఫీ అంత్యక్రియల నిర్వహణలో జాప్యం చోటుచేసుకుంది. గడాఫీ మృతికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తుతోపాటు ఎక్కడ ఖననం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకున్నాకే అంత్యక్రియలు జరుగుతాయని లిబియా అధికారులు ...
గడాఫీ ఖననంపై రాజుకుంటున్న వివాదంప్రజాశక్తి
ముగిసిన మరో నియంత చరిత్ర సాయుధ దళాల కాల్పుల్లో నేలకొరిగిన గడాఫీVaartha Telugu news portalఅన్ని 12 వార్తల కథనాలు »

ఎవ్వరినీ వదిలేది లేదు : ఆనం
హైదరాబాద్: అక్రమాలకు ఆధారాలు ఉంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సహా ఎవ్వరినీ వదిలేది లేదని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి ఆదివారం అన్నారు. హెలికాప్టర్ దిగే విధంగా ...ఇంకా మరిన్ని »

హామీ రాకుండానే సమ్మె ఎందుకు విరమించారు?
    హైదరాబాద్ (వి.వి.) : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకుండానే సకల జనుల సమ్మెను ఎందుకు విరమించాల్సి వచ్చిందో జెఎసి ఛైర్మన్ కోదండరామ్ సమాధానమివ్వాలని తెలంగాణ ప్రజాసంఘాల జెఎసి కన్వీనర్ గజ్జెల కాంతం డిమాండ్ చేశారు. ...
సకల జనుల సమ్మె: కోదండరామ్ ఇంటి ముట్టడి, ఉద్రిక్తతదట్స్ తెలుగు
ప్రొ.కోదండరామ్ నివాసం ముట్టడిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »

త్వరగా తేల్చితే బావుంటుంది : సీఎం
న్యూఢిల్లీ: సోనియా గాంధీకి శస్త్రచికిత్స ముగిసిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఆమెతో భేటీ అయ్యారు. సకల జనుల సమ్మె, తెలంగాణ, ఎమ్మెల్సీ తదితర అంశాలపై సోనియాతో చర్చించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ అంశాన్ని త్వరలో తేల్చితే బావుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ ...
తెలంగాణపై తేల్చండి: సోనియాతో సిఎం కిరణ్దట్స్ తెలుగు
సోనియాతో ముఖ్యమంత్రి సమావేశంసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »

కెసిఆర్ను జగన్తో పోల్చిన టిడిపి నేత మోత్కుపల్లి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కంటే పెద్ద అవినీతిపరుడని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు ఆదివారం ...
,కెసిఆర్ లకు ఎర్రబెల్లి, మోత్కుపల్లి సవాల్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »

దూకుడు నిర్మాత త్రీడి చిత్రం డిటేల్స్
దూకుడు వంటి బ్లాక్ బస్టర్ నిర్మించిన అనిల్ సుంకర త్వరలో ఓ త్రీడీ చిత్రాన్ని త్వరలో ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు. అల్లరి నరేష్ త్వరలో ఓ త్రీడి చిత్రంలో కనపించనున్నారు. ఈ చిత్రంలో నలుగురు హీరోలు ఉంటారు. ఇది సాంఘిక చిత్రమే. మెయిన్ హీరోగా అల్లరి ...
త్రీడీ సినిమాలో నరేష్సాక్షి
త్రీడీ మూవీలో అల్లరి నరేష్విశాలాంధ్ర
అన్ని 4 వార్తల కథనాలు »

సూర్య, రవితేజ కాంబినేష్ లో చిత్రం..డిటేల్స్
తెలుగు,తమిళ హారోలు కలిసి ద్విభాషా చిత్రానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ స్టార్స్ మరెవరో కాదు సూర్య,రవితేజ. సూర్య నటించిన చిత్రాలన్నీ తెలుగులో డబ్బింగై హిట్ అవుతున్నాయి. అలాగే రవితేజ నటించిన చిత్రాలు తమిళంలోకి అనువాదం అవుతూ నిర్మాతలకు లాభాలను ...
రోబోకంటే పదిరెట్లు క్రేజ్ వచ్చింది!విశాలాంధ్ర
భారీ అంచనాలతో సెవెన్త్ సెన్స్ప్రజాశక్తి
అన్ని 7 వార్తల కథనాలు »
నేడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే
యువతుల మదిని దోచుకుని తెలుగు చిత్ర పరిశ్రమలో, తెలుగు ప్రేక్షక హృదయాలలో ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు నేడు. ఈశ్వర్ తో తన సినీ కెరియర్ ని ప్రారంభించి జయాపజయాలు చవిచూసిన ప్రభాస్ డార్లింగ్, మిస్టర్ పెర్ఫెక్ట్ చిత్రాలతో ...
'రెబల్స్టార్'కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు
ట్రెండ్ మార్చిన రెబల్ స్టార్ స్టైలిష్ లుక్ తో...!   అన్ని 3 వార్తల కథనాలు »

పోలీసు సంక్షేమానికి ఏటా కోటి రుపాయిలు !
హైదరాబాద్,(వి.వి) : ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు ఉన్న మాదిరిగానే పోలీసు శాఖ కోసం ప్రత్యేక ఆస్పత్రి నెలకొలుపుతామని రాష్ట్ర హోం శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. అవసరమైతే పోలీసు సిబ్బందికి కార్పొరేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వ వ్యయంతో చికిత్సలు ...
పోలీసు సంక్షేమానికి పెద్దపీట రూ.7 కోట్లతో సహాయ కార్యక్రమాలు ...
అన్ని 4 వార్తల కథనాలు »


చిరంజీవి స్క్రిప్టు ఓకే చేసి గ్రీన్ సిగ్నల్ ..
చిరంజీవి చివరకు స్క్రిప్టు ఓకే చేసారు.అయితే అది ఆయన నటించే చిత్రానికి కాదు..తన కుమారుడు రామ్ చరణ్ చిత్రానికి. వివి వినాయిక్ దర్సకత్వంలో రూపొందనున్న చిత్రానికి చెందిన స్క్రిప్టుని చిరంజీవి విని సంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక ఆ స్క్రిప్టుని ఆకుల ...
'రచ్చ'లో సర్ప్రైజ్ సాంగ్     అన్ని 6 వార్తల కథనాలు »

గుర్తుండిపోయే ఫ్రెండ్
యువతరంలోని కన్ఫ్యూజన్స్, రకరకాల ఆలోచనల నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం 'ఓ మై ఫ్రెండ్' కథాంశం. సిద్దార్థ్, శ్రుతిహాసన్ జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా వేణు శ్రీరామ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నవంబర్లో ఈ సినిమా విడుదల కానుంది. ...
11-11-11న 'ఓ మై ఫ్రెండ్
అన్ని 2 వార్తల కథనాలు »

మేము కూడా ఇప్పడు ఆండ్రాయిడ్ మార్కెట్లోకి:జడ్టిఈ
జడ్టిఈ కార్పోరేషన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అయ్యేటటువంటి మొబైల్ ఫోన్ని విడుదల చేయనుంది. గతంలో మార్కెట్లోకి డ్యూయల్ సిమ్ ఫోన్స్ని విడుదల చేసిన జడ్టిఈ మొబైల్ కంపెనీ ఈ కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేయడం పట్ల హార్షం వ్యక్తం చేశారు. ఇంకా మరిన్ని »

అల్లు అర్జున్,త్రివిక్రమ్ చిత్రం ప్రారంభ తేది
అల్లు అర్జున్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం నవంబర్ రెండవ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆ రోజు నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ తో మొదలు కానుంది.ఇలియానా కూడా ఆ రోజునుంచి షూటింగ్ లో పాల్గొంటుంది. శక్తి చిత్రం విడుదలైన దగ్గరనుంచి కనపడకుండా ...
సురేందర్రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్సాక్షి   అన్ని 4 వార్తల కథనాలు »

బెజవాడ మీదే నాగ చైతన్య ఆశలు....!
ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేసిన అక్కినేని నాగచైతన్య రెండు ఫ్లాపులు, రెండు హిట్లతో బేలన్స్గా ఉన్నాడు. తొలి సినిమా జోష్, నాలుగో సినిమా దడ ఫ్లాపవగా రెండు, మూడు సినిమాలైన ఏమాయ చేసావె ,100% లవ్ సినిమాలు హిట్టయ్యాయి. అయితే మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవుదామని అతడు ...
కెరియర్ టర్నింగ్ లో నాగచైతన్య     అన్ని 2 వార్తల కథనాలు »

కొడుకుమీద నమ్మకంతో నాగార్జునే స్వయంగా...
తన కుమారుడు నాగచైతన్య తాజా చిత్రం బెజవాడపై ఉన్న నమ్మకంతో నాగార్జునే ఆ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని ఫ్యాన్సీ రేటు ఇచ్చి తీసుకున్నట్లు సమాచారం. దాంతో నవంబర్ మూడవ తేదీన విడుదలకు రెడీ అవుతున్న ఈ చిత్రం మార్కెట్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ...ఇంకా మరిన్ని »

దీపావళి ప్రమాదాలు... ఆయుర్వేద చికిత్సలు

- డా. చిరుమామిళ్ల మురళీమనోహర్

 

దీపావళి పండుగ అంటే అందరికీ సరదా. ఆయుర్వేద వైద్య శాస్త్రంలో పంచ జ్ఞానేంద్రియాలను సమర్థవంతంగా వినియోగించుకునే ప్రక్రియలను గురించి చెప్పారు. ఈ జ్ఞానేంద్రియాలను సరైన రీతిలో వినియోగించుకుంటే శారీరక, మానసిక స్వార్థ్యం సిద్ధిస్తుంది. వివిధ పండుగల్లో మనం జరుపుకునే వేడుకల్లో అంతర్లీనంగా ఇదే ఉద్దేశం కనిపిస్తుంది.దీపావళి పండుగ అనేది వర్షాకాలపు చివరి రోజుల్లో, చలికాలపు ప్రారంభపు దినాల్లో వస్తుంది. దీపావళి పర్వదినం జరుపుకోవడంలో ప్రధాన వైద్యపరమైన ఉద్దేశం గాలిని పరిశుద్ధం చేయటమే కాకుండా సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ లాంటి మనోసంబంధమైన రుగ్మతల బారిన పడనివ్వకుండా చేయటం. రుతు సంధి రోజుల్లో వర్షాంతపు కాలంలో భూమిలో క్రిమికీటకాలు పుడుతుంటాయి. దీపావళి సందర్భంగా పెద్దనేపాళపు గింజలు పుల్లకుగుచ్చి వెలిగించటం, జనపకట్టె కట్టలు వెలిగించటం వంటివాటివల్ల క్రిమికీటకాలు అదుపులో ఉంటాయి. ఇక చప్పుడు చేసే టపాకాయలవల్ల ఉదాసీనత, నిర్లిప్తత దూరమవుతాయి. మహాలయ పక్షంలో స్వర్గంనుంచి దిగి వచ్చి భూలోకంలో సంచరించే పితృదేవతలు దీపావళిన తిరిగి ప్రయాణమై వెళ్లేటప్పుడు, వారికి వెలుతురు చూపే నిమిత్తం భూలోకవాసులు చేతులతో కాగితాలు పట్టుకొని ఆకాశంవైపు చూపాలని శాస్తవ్రచనం. ఇది మన నమ్మకం. ఇదే ఆచారం కాలక్రమంలో మతాబుగా మారింది. అయితే అనేక సందర్భాల్లో ఈ ప్రధాన ఉద్దేశాలు తప్పుదారిపట్టి అవాంఛనీయమైన ఇక్కట్లు కలగటం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో దీపావళి రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, దీపావళి ప్రమాదాలను ఎదుర్కొనే పద్ధతుల గురించీ, ఆయుర్వేద గృహచికిత్సల గురించి వివరంగా ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం.
సాధారణ జాగ్రత్తలు..
దీపావళి సందర్భంగా పిల్లలు, పెద్దలు పోటీలుపడి టపాకాయలను కాలుస్తుంటారు. కొందరు టపాకాయలను కాల్చేటప్పుడు సాహస కార్యాలు చేసి తమ శరీరానికి హాని కలిగే విధంగా చేసుకుంటారు. చాలామందికి శరీరం కాలడం, గాయాలుకావడం అందరికీ విదితమే.
టపాకాయలను వీలైనంతవరకూ బైటి ప్రదేశాలలోనే కాల్చాలి. కాల్చే వ్యక్తులు, చుట్టుప్రక్కలవారు వీలైనంత వరకూ నేత బట్టలు ధరిస్తే మంచిది. అప్పుడు నిప్పురవ్వలు పైనపడినా ఒళ్ళు కాలదు. ఎంత చిన్న టపాకాయ అయినా చేతిలో పేలే విధంగా కాల్చకూడదు. శక్తివంతమైన బాంబులను, అవుట్లను కాల్చేప్పుడు వాటిని ఇసుకలో కాని మట్టిలో కాని నిలబెట్టి పొడవైన కర్ర లేదా పొడవాటి తీగ సహాయంతో నిప్పు అంటిస్తే మంచిది. అంటించిన వెంటనే పేలడం లేదని వాటిని చేతిలోకి తీసుకుని పరీక్షించకూడదు.
చాలామంది చిచ్చుబుడ్లను ప్రమాద రహితంగా భావించి చేతులలో ఉంచుకుని కాలుస్తారు. కాని ఒక్కొక్కసారి దానికి అడుగున రంధ్రం పడి, చేతులు కాలే ప్రమాదముందని గ్రహించాలి. లేదా అది ఒక్కొక్కసారి పేలిపోవచ్చు. ప్రతి ఒక్కరూ చెప్పులు తప్పనిసరిగా ధరించాలి. కొందరు బాగా శబ్దం వస్తుందని టపాకాయలను డబ్బాలలో వేసి కాలుస్తారు. అలా కాలుస్తున్నప్పుడు కొన్నిసార్లు డబ్బా ముక్కలై చుట్టుప్రక్కల ఉన్నవారి దేహాలలోకి చొచ్చుకుపోయే ప్రమాదముంది.
చిన్న పిల్లలు కాకరపువ్వులు ఎక్కువగా కాలుస్తూ సరదాకోసం పూలను ఒకరిపై మరొకరు విసురుతుంటారు. ఒక్కొక్కసారి నిప్పు రవ్వలు కంటిలో పడి కళ్ళు దెబ్బతినే ప్రమాదముంది. కనుక పెద్దలు దగ్గరుండి హెచ్చరిస్తూ మాత్రమే పిల్లలచేత టపాకాయలను కాల్పించాలి. వీటిని కాల్చిన తరువాత కాకరపువ్వొత్తి కాడలను అన్నిటినీ చెల్లాచెదురుగా పడేయకుండా ఒక దగ్గర జాగ్రత్తచేయాలి. గుడిసెలు, పూరిళ్ల దగ్గర తారాజువ్వలను కాల్చకూడదు. పెద్ద శబ్దాలు వచ్చే బాంబులవలన చిన్న పిల్లలకు చెవులు దెబ్బతిని శాశ్వతంగా చెవుడు వచ్చే అవకాశముందని గుర్తుంచుకోవాలి. ఇలా జరగకుండా ఉండాలంటే చెవుల్లో దూది పెట్టుకోవాలి.
టపాకాయలను తెచ్చుకునేప్పుడు వీలైనంతవరకూ వాటిని సూట్‌కేస్ లాంటి గట్టి వాటిలో తేవాలి. అలాగే వాటిని ఇంటిలో వంట గదికి దూరంగా వేడి తగలనిచోట ఉంచుకోవాలి. ఒకవేళ ప్రమాదవశాత్తూ బట్టలకు నిప్పంటుకుంటే భయపడి పరుగెత్తకూడదు. అలాచేస్తే మంట ఇంకా ఎక్కువవుతుంది. కనుక వెంటనే మందమైన దుప్పటిని ఒంటినిండా కప్పి కింద దొర్లిస్తే మంటలు ఆరిపోతాయి.
గృహ వైద్యం..
కాలిన గాయాలను ఆయుర్వేదం నాలుగు రకాలుగా వర్ణిస్తుంది.
1. మొదటి రకం అతి స్వల్పగాయాలు. ఇలాంటి దగ్ధవ్రణాలను ప్లుష్టం అంటారు. చర్మం రంగు మారి కేవలం కమిలినట్లు కనిపించటం ఈ తరహా గాయాల ప్రధాన లక్షణం. ఈ రకం అగ్నిదగ్ధస్థితి కనిపిస్తే కొద్దిగా కాపడం పెట్టాలి. చన్నీళ్లు ప్రయోగిస్తే రక్తం గడ్డకట్టి నొప్పి మరింత పెరుగుతుంది కనుక ఈ స్థితిలో రక్తప్రసరణ పెంచడానికి సుఖోప్నంగా కాపడం పెడితే సరిపోతుంది. లేదా కొద్దిగా వేడిచేసిన కొబ్బరి నూనెను కూడా ప్రయోగించవచ్చు.
2. రెండవ రకం దుర్దగ్ధం. కాలినచోట చిన్నచిన్న నీటి బొడిపెలు తయారవుతాయి. దీనిలో ముందు శీతల చర్యలు చేసి, ఆ తరువాత ఉష్ణప్రక్రియలు అవలంబించాలి.
3. మూడవ రకం సమ్యక్‌దగ్ధం. దీనిలో చుట్టూ ఉన్న చర్మం ఎండిన ఖర్జూరం రంగులో కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో వెదురుప్పు (వంశలోచనం), ఎర్ర చందనం, స్వర్ణగైరికం, తిప్పసత్తులను మెత్తగా పొడిచేసి, నెయ్యి కలిపి బాహ్యంగా ప్రయోగించాలి.
4. నాలుగవ రకం అతి దగ్ధం. దీనిలో చర్మం బాగా కాలిపోవటమే కాకుండా సంబంధిత ప్రాంతంలోని ఇతర భాగాలు కూడా దెబ్బతింటాయి. ఇలాంటి సందర్భాల్లో కాలి దెబ్బతిన్న మాంస ఖండాలను జాగ్రత్తగా తొలగించి, శీతల చర్యలు చేపట్టాలి. బియ్యం పిండిలో మంచి గంధంపొడి కలిపి బాహ్యంగా ప్రయోగించాలి.
ఆయుర్వేద ప్రథమ చికిత్సలు
* మంటలవల్ల గాయమైతే చల్లని నీటిలో కాలిన భాగాన్ని ఉంచాలి. మంచుముక్కలను గుడ్డలోచుట్టి స్థానికంగా ప్రయోగిస్తే మంట పుట్టకుండా, వాపు తయారుకాకుండా ఉంటుంది. లేదా చన్నీళ్లలో స్వచ్ఛమైన నూలుగుడ్డను తడిపి గాయంమీద ప్రయోగించాలి.
* కళ్లలో నిప్పురవ్వలు పడితే వెంటనే కళ్లలో చన్నీళ్లు చిలకరించాలి. రసాయనాలు పడితే అయిదు నిమిషాలపాటు చన్నీళ్లతో కళ్లను కడగాలి. లేదా చన్నీళ్లలో కళ్లను తెరిచి ఉంచాలి. తరువాత ఆవునెయ్యిని గాని, స్వచ్ఛమైన ఆవుపాలను గాని కళ్లలో డ్రాప్స్‌గా వేసుకోవాలి.
* కాలిన గాయాలపైన కలబంద (ఘృతకుమారి) రసాన్ని పూస్తే మచ్చ పడకుండా మానతాయి.
* దోసకాయ గుజ్జు, పచ్చి బంగాళ దుంప గుజ్జు, క్యారెట్ గుజ్జు, అరటి పండు గుజ్జు వంటివి కాలిన గాయంమీద ప్రయోగించి, పైన గాజు గుడ్డను చుడితే మంచి ఫలితం కనిపిస్తుంది.
* అతసీ తైలం (లిన్‌సీడ్ ఆయిల్)ను తేనెతోకలిపి రాస్తే కాలిన గాయాల్లో మంచి ఫలితం కనిపిస్తుంది.
* సన్నపు తేట (చూర్ణోదకం) ఒక భాగం, అతసీ తైలం మూడు భాగాలు కలిపి పైపూతగా రాస్తే కాలిన గాయాలు తగ్గుతాయి.
* నువ్వుల నూనె, కొబ్బరినూనె కలిపి రాస్తే కాలిన గాయాలు త్వరితగతిన మానతాయి.
* కాలిన ప్రదేశంలో తేనెను ప్రయోగించవచ్చు.
* చెంచాడు వంట సోడాను ఒక కప్పు నీళ్లకు కలిపి స్థానికంగా ప్రయోగిస్తే మంట, నొప్పి వంటివి దూరమవుతాయి.
* కొబ్బరినూనె, సున్నపు తేట కలిపి, మలాం మాదిరిగా చేసి కాలిన గాయంమీద ప్రయోగించవచ్చు.
* నల్లతుమ్మ బంకను నీటిలో కలిపి పేస్టు మాదిరిగా చేసి స్థానికంగా ప్రయోగిస్తే హితకరంగా ఉంటుంది.
* వేపాకులు, నువ్వులు, తేనె కలిపి ముద్దగా నూలి కాలిన గాయం మీద ప్రయోగించాలి.
* కానుగ ఆకులు, వేపాకులు, వావిలి ఆకులు ముద్దగా నూరి కాలిన గాయం మీద ప్రయోగించాలి.
* ఇలా ప్రథమ చికిత్స చేసిన తరువాత గాయాల తీవ్రతనుబట్టి వైద్య సహాయం పొందాల్సి ఉంటుంది.
* రావిచెట్టు (అశ్వత్థ/పీపల్) మాను బెరడును ఎండబెట్టి, 

అఫూర్వ అక్కాచెల్లెళ్లు!


దో అందమైన కుటుంబం. జనెట్ - గ్రాహమ్ వాల్టన్‌లకి ఆరుగురు కూతుళ్లు. 1983, నవంబర్ 18 నుంచీ ఇప్పటి వరకూ అందరికీ ఒక్కటే మాట. ఎప్పటికీ ఒక్కటే మాట. ఎక్కడికి వెళ్లినా అంతా కలిసే వెళతారు. ఆఖరికి మార్కెట్‌లో కూరగాయలు కొనాలన్నా. వంట గదిలో ముచ్చట్ల మధ్య కలిసి వంట చేస్తారు. ఏ నిర్ణయమైనా కలిసి తీసుకుంటారు. ఏదైనా పార్టీ అంటే వీళ్లంతా ఉంటే చాలు. సందడే సందడి. పార్టీలకూ ఫంక్షన్లకూ పోలోమంటూ వెళ్లి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతారు. సమిష్ఠి కుటుంబం ఊసే కనిపించిన ఈ రోజుల్లో వీళ్లంతా రేపటి ప్రపంచానికి ‘కలిసి ఉంటే కలదు సుఖం’ అన్న నినాదాన్ని చాటి చెబుతున్నారేమిటా? అంటూ అచ్చెరువొందబోయే ముందు మరో మాట చెప్పుకోవాలి. 1983, నవంబర్ 18న జనెట్ - గ్రాహమ్ వాల్టన్‌లకి పుట్టిన ఈ ‘సంతానం’ కేవలం రెండు మూడు నిమిషాల వ్యవధిలో జన్మించిన ‘కవలలు’ కావటం కొసమెరుపు. ప్రపంచంలో ఇటువంటి అరుదైన ‘కవల’లకు కొదువ లేకున్నప్పటికీ భూమీద పడిన వారందరూ ‘బట్ట’ కట్టిన దాఖలాలు బహు కొద్ది మాత్రమే. ఎన్నో అనారోగ్య సమస్యల్ని అధిగమించి ప్రస్తుతం 27వ వసంతంలోకి అడుగుపెట్టిన వీరంతా జాతికి ఎన్నో సందేశాల్ని మోసుకొస్తున్నారు. మొదటిగా పుట్టిన హన్నా, ఆ తర్వాతి లూసీ, రూత్, శారా, కటె, ఆఖరి జెన్నీ.. అప్పుడే పుట్టినప్పుడు తీసిన బ్లాక్ అండ్ వైట్ ఫొటో మొదలుకొని.. ఇలా ప్రత్యేకించి ప్రతి సందర్భంలోనూ జనాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూనే ఉన్నారు. స్కూల్ యూనిఫాంలో పక్కపక్కన నిలుచుంటే.. ఎవరు ఎవరో గుర్తు పట్టడం అసాధ్యం. ఇంటికి ఎవరైనా చుట్టాలొస్తే.. ఇల్లంతా ఒక్కరే అక్కడక్కడ ప్రత్యక్షమై అదృశ్యమవుతున్నట్టు భావిస్తారట.
ఈ లోకంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురుంటార్ట అని నోరెళ్ళబెట్టబోయే ముందు ఆ సంఖ్యని ‘ఆరుగురి’కి కుదించి.. ఇదిగో ఇక్కడే అన్నట్టు ఉంటుంది. విర్రల్‌లోని వల్లాసెలో ఎనిమిది బెడ్‌రూంలో ఇంట్లో ఉంటున్న వీరంతా ఇటీవల ఉద్యోగాల రీత్యా... చదువుల రీత్యా చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. అంతమాత్రం చేత ‘సమిష్ఠి’ అర్థం మారిందనుకుంటే పొరపాటే. వారాంతంలో ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో కలిసి భోజనాల బల్లకి చేరుకోవాల్సిందే. 58 ఏళ్ల తల్లి జనెట్ వీరిని చూసి మురిసిపోతూ.. ఒక్కొక్కరి మనస్తత్వం గురించి వివరిస్తుంది. లూసీ అందరినీ అజమాయిషీ చేస్తుంది. శారా కొద్దిగా నెమ్మది. రూత్‌లోనూ బాసిజం. కటె అయితే అకడమిక్‌లో ఫస్ట్.. హన్నాకి ఆర్గనైజ్ చేయటం బాగా తెలుసు. హన్నా ఇటీవలే ‘పిజిసిఇ’ పూర్తి చేసి ప్రైమరీ స్కూల్‌లో వర్క్ చేస్తోంది. షాపింగ్ చేయటం.. పుస్తకాలు చదవటం.. స్నేహితులతో కబుర్లతో కాలం గడిపేస్తుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు.
ఇంతమంది కవలల్ని చూట్టం ఆ ఊరి జనానికి అలవాటై పోయినా.. ఎవరు ఎవరో కొద్ది క్షణాలు గడిస్తే తప్ప చెప్పలేరు. వారి 18వ ఏట ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించటం మరో విశేషం.

ప్రతీకారం ..


-మల్లాది వెంకట కృష్ణమూర్తి

సుపుపచ్చ హౌస్ గౌనులో ఉన్న లూసీ చేతిలో చిరునవ్వు నవ్వే స్మైలీ ఫేస్ బొమ్మగల కాఫీ కప్‌ని పట్టుకుని, మరణించిన తన భర్త గదిలోని ఫొటోల వంక చూసింది. మూడువారాల క్రితం హార్ట్ అటాక్‌తో మరణించిన ఆమె భర్త స్టీఫెన్‌కి రహస్య ప్రియురాలు ఉందన్న సమాచారం ఆరోజే లూసీకి తెలిసి షాకైంది. అలబామాలోని టస్కాంబియా అనే ఊళ్ళో తమ ఇంటికి వందడుగుల దూరంలోని ఇంకో ఇంట్లో నివశించే ఓ విధవరాలితో అతనికి శారీరక సంబంధం ఉందన్న సంగతి తెలిసిన లూసీ షాకైంది అని చెప్పడం తక్కువచేసి చెప్పడమే అవుతుంది. చాలాకాలంగా లూసీ ఇల్లు మారదామని చెప్తున్నా స్టీఫెన్ ఏదో కారణం చెప్పి ఇల్లు మారకుండా ఉండడానికి గల అసలు రహస్యం లూసీకి ఆరోజే తెలిసింది.

అమెరెట్టో స్ట్రైమ్‌లేండోతో!
తన బెస్ట్‌ఫ్రెండ్‌తో!!
చిన్నప్పట్నించి తనతో కలిసి చదువుకున్న తన బాల్య స్నేహితురాలితో!!!
షార్లెట్‌కి చెందిన ఓ మెక్సికన్‌ని అమెరెట్టో వివాహం చేసుకుని ఇద్దరు పిల్లల్ని కూడా కన్నది. ఆ మెక్సికన్ మర్ఫీ అర్థాయుష్కుడై సాధారణ జ్వరంతో మరణించాడు. టౌన్‌హాల్‌లో క్లర్క్‌గా పనిచేసే లూసీ అమెరెట్టోతో ఫోన్‌లో మాట్లాడుతుంది. తప్ప ఆమె ఇంటికి వెళ్ళడం, కలవడం తక్కువ. అమెరెట్టో కూడా తనింటికి లూసీని మనసుపెట్టి ఆహ్వానించక పోవడానికి కారణం ఇదన్నమాట! వాళ్ళిద్దరూ ఉండగా తను వెళ్తే రహస్యం బయటపడుతుందని పిలిచి ఉండదు.
ఐనా నలభై అయిదు పైబడ్డ అమెరెట్టోకి ఈ బుద్ధి ఈ వయసులో ఎందుకు? శారీరక అవసరం ఉంటే పెళ్ళి చేసుకోవచ్చుగా? పెళ్ళీడుకి వచ్చిన ఇద్దరు కూతుళ్ళుగల ఆ వృద్ధనారిది ఎంత పాడుబుద్ధి? ఇరవై ఏళ్ళ పెద్ద కూతురు ఆగ్నెస్‌కి ఇది తెలియచ్చన్న భయంకూడా లేదా?
ప్రఖ్యాత మూగ, చెవిటి, అంధురాలైన హెలెన్ కెల్లెర్ పుట్టిపెరిగిన టస్కంబియాలోని తను ఎంత గుడ్డిది? ఎంతటి చెవిటిది? ఎవరూ తనని వీరి వ్యవహారం గురించి ఇంతదాకా హెచ్చరించలేదు. అదీ పదిహేనేళ్ళుగా సాగుతున్నా! ఇద్దరూ ఎంత జాగ్రత్తపడి ఉంటారో?
మోసకారి అయిన అమెరెట్టో రహస్యం ఆమె రాసిన ఉత్తరాలవల్ల బయటపడింది. ఆమెని తన భర్త తీసిన ఫొటోలవల్ల బయటపడింది. తన భర్త పోయాక లూసీ అతని గదిలోని అతని వస్తువులని, కాగితాలని సర్దుతూంటే ఓ తాళంచెవి కనిపించింది. అది చక్కటి సువాసన వేసే చిన్న నీలంరంగు వెల్వెట్ సంచీలో లేకపోతే లూసీ దాన్ని పెద్దగా పట్టించుకునేది కాదు. దాని రెండోవైపు హృదయాకారంలో హేండిల్ ఉంది. ఏమిటీ తాళంచెవి? అతని గదిలోని అనవసరమైనవి అన్నీ అప్పటికే చెత్తబుట్టలో పడేసింది.
తర్వాత బేస్‌మెంట్‌లోని అతని లైబ్రరీని సర్దసాగింది. లూసీకి మొదటినించీ సాహిత్యంమీద ఎలాంటి అభిరుచి లేదు. ఆమె భర్తకి చాలా ఉంది. ప్రయాణాల్లో కొన్న అనేక పుస్తకాలు అతని లైబ్రరీలో ఉన్నాయి. అతను ఆఫీసు పనిమీద తరచూ ప్రయాణాలు చేస్తుంటాడు. కాబట్టి ఆ లైబ్రరీ కూడా పెద్దదిగా ఉంది. బహుశా అతను అమెరెట్టోని కూడా తన ట్రిప్‌లో వెంట తీసుకెళ్ళి ఉంటాడు. లేకపోతే మోటల్‌లో అమెరెట్టోకి తీసిన ఫొటోలు తన భర్త రహస్య పేటికలో ఎందుకు ఉంటాయి?
రేక్స్‌లోని పుస్తకాలని తీసి చూస్తూ ఓ పుస్తకాన్ని తెరవలేకపోయింది. దాని పేజీలు తెరచుకోలేదు. పరీక్షగా చూస్తే అది పుస్తకం కాదని, నిజానికి అలా డిజైన్ చేసిన, పైన కార్డ్‌బోర్డ్ అట్ట అతికించిన ఇనప్పెట్టె అని గ్రహించింది. అలాంటి పెట్టెలు ఉంటాయని కూడా లూసీ ఎన్నడూ ఊహించలేదు. దానికి గల తాళంచెవి రంధ్రాన్ని చూసాక తన భర్త గదిలో సంచీలోని తాళంచెవి గుర్తుకు వచ్చింది.
వెంటనే వెళ్ళి ఆ తాళంచెవిని తెస్తూ, తన భర్త ఆ పెట్టెలో ఏం దాచి ఉంటాడా అని అనుకుంది. ఆ తాళంచెవి దానిదే! మూత తెరచి చూస్తే సెంట్ పరిమళం బయటకి వ్యాపించింది. అమెరెట్టో ఆ గదిలోకి వచ్చిందా అని లూసీ తల తిప్పి చూసింది కూడా. ఎందుకంటే అది ఆమె వాడే సెంటే.
లోపల నించి రబ్బర్ బేండ్ పెట్టిన నీలి
రంగు కవర్ల దొత్తరని బయటకి తీసింది. అన్నిటిమీద తన భర్త ఆఫీసు చిరునామాలని గమనించింది. ఆ కవర్ల మీది చిరునామా అమెరొట్టో చేతి వ్రాతలో ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. భృకుటి ముడివేసి ఒక్కొక్కటే బయటకి తీసి చదువుతూంటే వారిమధ్య గల శారీరక సాన్నిహిత్యం గురించి తెలిసింది. శారీరకంగానే కాక అమెరెట్టో తన భర్తతో అక్షరాల ద్వారా కూడా ఆ ఉత్తరాలతో రతిని జరిపిందని తెలుసుకుంది. బూతు పదాలతో, బూతు భావాలతో వారిమధ్య తర్వాతి రతి ఎలా ఆరంభం అయి ఎలా అంతం అవాలని అనుకుంటోందో వివరంగా రాసి ఉన్నాయి. కొన్నిటిలో వారి గత రతిని అమెరెట్టో వివరంగా వర్ణిస్తూ, అది తనని ఎంత బాగా ఆనందింప చేసిందో వివరించింది.
లూసీ రెండు ఉత్తరాలు చదవగానే ఇక నిలబడలేక భర్త లైబ్రరీ కుర్చీలో కూలబడిపోయింది. అతని బల్లమీద తల ఆనించింది. లూసీకి తెలియకుండానే ఆమెకి దుఃఖం కట్టలు తెంచుకుని పొంగి పొర్లింది. స్నేహితుల్లో ఇంతటి నమ్మక ద్రోహులు ఉంటారా? భర్తల్లో ఇంతటి మోసగాళ్ళు ఉంటారా?
అర్ధనగ్నంగా, నగ్నంగా అమెరెట్టోకి తీయబడ్డ ఫొటోలు కూడా ఆ పెట్టెలోని ఓ బ్రౌన్ రంగు దళసరి కవర్లో కనిపించాయి. అమెరెట్టోకి పిల్లలు పుట్టినా ఒళ్ళు రాలేదు. ఆగ్నెస్ అమెరెట్టో చెల్లెలు అని చాలామంది భ్రమపడతారని లూసీకి తెలుసు. ఆ సంగతి అమెరెట్టో కూడా గర్వంగా చెప్తూంటుంది. తను పిల్లలు పుట్టకపోయినా లావుగా వుంటుంది. అందుకనే మోడల్‌గా ఫోజులిచ్చి అమెరెట్టో తన భర్తతో ఫొటోలు తీయించుకున్నట్లుంది.
లూసీ సిగరెట్లు మానేసి ఏడాదిన్నర అయింది. కాని ఆ అగ్నిపర్వతం పేలగానే ఆమెకి సిగరెట్ తాగాలని అనిపించింది. లైబ్రరీలో వెదికితే తన భర్త సిగరెట్ పాకెట్ ఆమె ఆశించినట్లుగా ఒకటి కనిపించింది. అందులోంచి ఓ సిగరెట్ తీసి ముట్టించింది. లూసీకి ఆరోజంతా తలమీద బరువైన వస్తువుతో మోదితే బుర్ర మొద్దుబారినట్లుగా మొద్దుబారిపోయింది. ఆ రాత్రి తన భర్త నిద్రమాత్రని ఉపయోగిస్తే కాని నిద్ర పట్టలేదు.
మర్నాడు నిద్రలేచాక ఆమె పక్కమీంచి లేవకుండా కొద్దిసేపు ఏం చేయాలా అని ఆలోచించింది. తన భర్త జీవించి ఉంటే అతనికి విడాకులు ఇవ్వడమో లేదా చంపడమో చేసేసేది. ఆయన ఎటూపోయాడు. ఇక మిగిలింది ఈ పాపంలో భాగస్వామురాలైన అమెరెట్టో. ఆమెకి తగిన ప్రతీకారం చేయాలి.
కానీ ఎలా?
ఆ ఉత్తరాలని, ఫొటోలని వెబ్ సైట్‌లో పెట్టడం అనే ఆలోచన తట్టింది. కాని నగ్న చిత్రాలని వెబ్‌సైట్‌లో ఉంచితే అది నేరం. ఫొటోగ్రఫీ నిరోధక చట్టం కింద తనని పోలీసులు అరెస్ట్‌చేయచ్చు.
ఇంకో ఆలోచన స్ఫురించింది. వెంటనే ఆమె మొహంలోకి వెలుగు ప్రవేశించింది. అమెరెట్టో మనస్థత్వం లూసీకి తెలుసు. అలాచేస్తే అది అమెరెట్టోని చాలా బాధిస్తుంది. పరిస్థితులని తట్టుకోగల మానసిక స్థైర్యం అమెరెట్టోలో లేదు. ఆమె ఓసారి అప్పటికే మానసిక బలహీనతతో గోళ్ళ రంగుని తాగి ఆత్మహత్యా ప్రయత్నంచేస్తే కూతురు రక్షించిందని ఒక్క లూసీకే తెలుసు.
* * *
‘‘మీవారు పోయారని తెలిసాక నువ్వు ‘మనిద్దరం ఇప్పుడు విధవలం’ అని ఏడ్చావు గుర్తుందా?’’ లూసీ అమెరెట్టోని అడిగింది. వారిద్దరూ పెయిన్‌టెన్‌లోని తమ ఇంటి బయట పేవ్‌మెంట్ మీద నడుస్తున్నారు.
‘‘అవును?’’
‘‘నిజానికి ఆగ్నెస్ అలా ఏడవాలి?’’
లూసీ కంఠంలోని సానుభూతిని, బాధని గ్రహించిన అమెరెట్టో వెంటనే అడిగింది.
‘‘అదేమిటి?’’
‘‘మావారు పోయాక ఆయన లైబ్రరీని సర్దుతుంటే ఆయన భద్రంగా దాచుకున్న ఉత్తరాలు, ఫొటోలు కొన్ని కనిపించాయి?’’
‘‘అవి ఎవరి నించి?’’ ఆదుర్దాగా అడిగింది అమెరెట్టో.
‘‘ఆగ్నెస్ నించి.’’
‘‘ఎవరి నించి?’’ ఆగి లూసీ చెయ్యిపట్టుకుని అడిగింది అమెరెట్టో కరుగ్గా.
‘‘నా భర్తకి. మీ అమ్మాయికి శారీరక అక్రమ సంబంధం ఉందన్న సంగతి నాకు ఆ ఉత్తరాలు చదివేదాకా తెలీదు. మావారు తరచూ వంద మైళ్ళ దూరంలోని ఆఫీస్ కేంప్‌కి వెళ్ళినప్పుడల్లా ఉదయం వెనక్కి మీ ఇంటికి వచ్చి, ఆగ్నెస్‌తో సెక్స్‌లో పాల్గొనేవారు. ఆ సమయంలో నువ్వు ఎక్కడికి వెళ్ళేదానివి?’’
అమెరెట్టో మొహంలో కత్తివాటుకు నెత్తురుచుక్క లేనంతగా పాలిపోయింది.
‘‘నిజంగా?’’ ఒణికే కంఠంతో అడిగింది.
‘‘అవును. మీ అమ్మాయిని నగ్నంగా మీ ఇంట్లో తీసిన ఫొటోలు కూడా చాలా చూసాను. అవి నా కళ్ళబడ్డాయి కాబట్టి చింపేసాను. ఇంకెవరి కళ్ళబడ్డా ఆగ్నెస్ బ్రతుకు పాడయ్యేది.’’
అమెరెట్టో నిలబడలేనట్లుగా ఆ పేవ్‌మెంట్ మీదే కూలబడి, పిచ్చిదానిలా చూడసాగింది. ఆమె మనస్థితిని గమనించి బాధని నటిస్తూ చెప్పింది లూసీ.
‘‘ఏమిటది? లే. ఓ ఫొటోని ఆటోమేటిక్ కెమేరాతో టైమర్‌తో మా ఆయన తీసాడు. దాంట్లో ఎవరెవరు ఉన్నారో తెలుసా? మధ్యలో మావారు, అటుఇటూ నీ పెద్ద కూతురు ఆగ్నెస్, చిన్న కూతురు రీటా. నగ్నంగా వాళ్ళేం చేస్తున్నారో చెప్పలేను.’’
తక్షణం అమెరెట్టో లేచి నిలబడింది. గబగబా ముందుకు నడుస్తూ తన ఒంటి మీది కోట్‌ని తీసి పక్కకి విసిరేసింది. తర్వాత స్లేక్‌ని. తర్వాత బ్రాని. ఆ తర్వాత జీన్స్ పేంట్‌ని. ఆ తర్వాత పేంటీని, సాక్స్‌ని, బూట్లని.
అటు ఇటు ఇళ్ళ వంక చూస్తూ చేతులూ ఊపుతూ నగ్నంగా నడుస్తూ, మధ్యమధ్యలో డేన్స్ చేయసాగింది. పక్కనించి వెళ్ళే కార్ల డ్రైవర్లు ఆమెని చూసి హారన్ కొట్టసాగారు. ఆ కార్ల వంక చూస్తూ గాల్లోకి ముద్దులు వదులుతూ అమెరెట్టో ముందుకి సాగింది. లూసీ తనలోని ద్వేషం చల్లారుతుండగా అమెరెట్టో వంక తృప్తిగా చూసింది. ఓ పోలీస్ కారు వచ్చి రోడ్డుపక్క ఆగింది. అందులోంచి దిగిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు అమెరెట్టో దగ్గరకి వేగంగా వెళ్ళి ఆమెని ఏదో ప్రశ్నించి, ఆమె చేతులు వెనక్కి విరిచి బేడీలు వేసారు. కారులో ఎక్కించుకుని తీసుకెళ్ళారు.
లూసీ సన్నగా కూనిరాగం తీస్తూ వెనక్కి తిరిగింది.

(మైఖేల్ మెలోన్ రచనకి    
 స్వేచ్ఛానువాదం) 

ఒక్క సీటు కోసం..


-సిఎం, పిసిసి చీఫ్ తెరవెనుక రాజకీయం

 -తనవాడి కోసం ప్రయత్నాలు చేస్తున్న గవర్నర్

 -రంజుగా మారిన కౌన్సిల్ సీటు వ్యవహారం


 న్యూఢిల్లీ, అక్టోబర్ 23: తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య ఖాళీ చేసిన శాసన మండలి సీటు కోసం పలువురు నాయకులు దేశ రాజధాని ఢిల్లీలో హోరాహోరి పోరాటం చేస్తున్నారు. ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి తన వర్గానికి చెందిన వారికి టికెట్ ఇప్పించుకునేందుకు తెరవెనక పావులు కదుపుతుంటే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తన వ్యక్తి కోసం కృషి చేస్తున్నారు. చివరకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా ఒకరికి శాసన మండలి టికెట్ ఇప్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరిన చిరంజీవి పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు విద్యాధర్‌రావుకు టికెట్ ఇప్పించేందుకు బొత్సా సత్యనారాయణ తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిసింది.

చిరంజీవి ప్రతిపాదిస్తున్న విద్యాధరరావును శాసన మండలికి తీసుకురావటం ద్వారా పార్టీని బలోపేతం చేయటంతోపాటు తన వర్గం మరింత పటిష్ఠం అవుతుందని బొత్స ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అయితే ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి మాత్రం ఇందుకు సమ్మతించటం లేదని చెబుతున్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన ఒక నాయకుడికి టికెట్ ఇప్పించుకునేందుకు ఆయన తెరవెనుక రాజకీయం నడిపిస్తున్నారని అంటున్నారు.
అయితే ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు తమ వర్గానికి చెందిన వారికి టికెట్ ఇప్పించుకునేందుకు జరుపుతున్న ప్రయత్నాలను గవర్నర్ నరసింహన్ దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఆయన నెల్లూరు జిల్లాకు చెందిన మాదాసు గంగాధరానికి టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. గంగాధరానికి టికెట్ ఇప్పించేందుకు ఆయన ఢిల్లీలోని పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులకు టెలిఫోన్ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే మాజీ మంత్రి కంతేటి సత్యనారాయణ రాజు కూడా విధాన మండలి టికెట్ కోసం ఎక్కిన గడప మళ్లీ ఎక్కకుండా తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన పలువురు సీనియర్ నాయకులు ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు తెలిసింది. మరో నాయకుడు ప్రసాదరాజు కూడా సీటు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఆయన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ద్వారా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మాజీ మంత్రి షబ్బీర్ అలీతోపాటు శాసన సభ మాజీ స్పకర్ ఒకరు కూడా శాసన మండలి సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. మాజీ మంత్రి త్రిపురాన వెంకటరత్నం కూడా దేశ రాజధానిలో మకాం వేసి సీటు కోసం ప్రయత్నించటం గమనార్హం. కొణిజేటి రోశయ్య కూడా తాను ఖాళీ చేసిన సీటును తన వర్గానికి చెందిన వారికి ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే మాట కూడా వినిపిస్తున్నా అది రూఢీ కావటం లేదు.
ఇదిలా ఉంటే ఇటీవలనే కాంగ్రెస్‌లో చేరిన ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నాయకుడు విద్యాధరరావుకు టికెట్ ఇస్తే సహించేది లేదంటూ పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణను కలిసి స్పష్టం చేశారని అంటున్నారు. చిరంజీవికి ఏదైనా పదవి ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చు కానీ విద్యాధర రావుకు ఇప్పుడే శాసన మండలి సీటు కేటాయించటం ఎంత మాత్రం మంచిది కాదని వారు చెబుతున్నట్లు తెలిసింది. రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన ఒక రాజ్యసభ సభ్యుడు ఇటీవలనే బొత్సా సత్యనారాయణను కలిసి విద్యాధర రావుకు విధాన మండలి టికెట్ ఇవ్వకూడదని స్పష్టం చేశారని అంటున్నారు

22, అక్టోబర్ 2011, శనివారం

తెలుగు సినిమా రెంజ్ పెరిగిందా?


కానీ అప్పుడు తెలీదు...ఈ వెనుకంజ మరో గొప్ప ముందంజ కోసమేనని... ఆ గాయాలు ఇప్పటి బాక్సాఫీసు విజయాల కోసమేనని...మళ్లీ తాజాగా ‘దూకుడు’గా మొదలైన తెలుగు సినిమా కలెక్షన్ల పరంపర ఇప్పుడు తెలుగు సినిమా రేంజ్‌ని సరికొత్తగా నిర్వచించాల్సిన అవసరాన్ని సృష్టిస్తోంది.
‘రేంజ్’కి కొలమానమేంటి?
సినిమా-అది తెలుగుదైనా, తమిళమైనా, హిందీ అయినా అనేది ప్రధానంగా ఆర్థిక వ్యాపారం! జనాల్ని ఎంటర్‌టైన్ చేసి తద్వారా వచ్చిన ఆదాయంతో మనగలిగే పరిశ్రమ సినిమా రంగం! అందుకే సినీ పరిశ్రమలో ‘రేంజ్’కి కొలమానం బాక్సాఫీసు కలెక్షనే్ల! కాగా మనదేశంలో ప్రధానంగా బాలీవుడ్, కోలీవుడ్ (తమిళ సినీ పశ్రమ), మాలీవుడ్ (మలయాళ సినీ పరిశ్రమ), సాండల్ వుడ్ (కన్నడ సినీరంగం), టాలీవుడ్ (తెలుగు సినీ రంగం) వంటివి సినిమాలను అధికంగా నిర్మిస్తున్న ప్రధాన సినీ పరిశ్రమలు. వీటన్నింటిలోను బాలీవుడ్ తర్వాత అతిపెద్ద సినీ పరిశ్రమ స్థాయిని అందుకున్న సినీరంగం మన తెలుగు సినీ రంగం! ఇలా ఈ స్థాయిని అందుకోవడంలో రెండు కారకాలు ముఖ్యమైనవి.
1. భారీ బడ్జెట్లు, 2. భారీ కలెక్షన్లు.
ఆ మాటకొస్తే ఏ సినీ పరిశ్రమనైనా దాని రేంజ్‌ని డిసైడ్ చేసేవి ఈ మూడు అంశాలే. ఈ మూడు కారకాల విషయంలో తెలుగు సినీ పరిశ్రమ గత 80 ఏళ్ల కాలంలో ఎనె్నన్నో మైలురాళ్లని అధిగమించి ముందుకొచ్చింది. కొత్తకొత్త వ్యాపార మార్గాలను అనే్వషించింది. ఆదాయ మార్గాలను పెంచుకుంది. దేశవ్యాప్తంగా వ్యూయర్‌షిప్ ఉన్న బాలీవుడ్ సినిమాల కలెక్షన్లను ఇంచుమించు అందుకుంది. కొత్త మార్కెట్లకు విదేశీ ఆడియన్స్‌కు కూడా చేరువవుతూ తన వినోద సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటోంది.
భారీ బడ్జెట్‌లు
ఒకప్పుడు తెలుగు సినిమా బడ్జెట్ వేల రూపాయలు మాత్రమే. 1931లో వచ్చిన తొలి తెలుగు సినిమా ‘్భక్తప్రహ్లాద’ అప్పటి ధరల్లో కేవలం 15 వేల రూపాయలతోనే నిర్మాణమైంది. కానీ ఇప్పుడు చిన్న సినిమా తీయాలన్నా, లో బడ్జెట్ సినిమా తీయాలన్నా కనీసం 4 కోట్ల రూపాయలు అవసరం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇక బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్‌కల్యాణ్ వంటి హీరోల సినిమాలు తీయాలంటే ఇప్పుడు అధమపక్షం 25 కోట్లు కావాల్సిందే. ఇక యంగ్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్‌బాబు, ప్రభాస్ వంటి హీరోల సినిమాలంటే ఇప్పుడు కావాల్సిన బడ్జెట్ 30 కోట్ల పైమాటే!
గత మూడేళ్ల కాలం నుండి తెలుగు సినిమాల బడ్జెట్‌లో భారీ పెంపుదల కానరావడం మొదలైంది. 2007లో ఈ హీరోల సినిమాల నిర్మాణ వ్యయం సగటున 15నుండి 20 కోట్ల వరకు పెరిగింది. అప్పుడే సినీ పెద్దలు, విశే్లషకులు అందరూ సినీపరిశ్రమ మనుగడ సాగించాలంటే నిర్మాత పచ్చగా ఉండాలంటే ‘బడ్జెట్‌లో నియంత్రణ’ అవసరమనే సూచనలు చేశారు. కానీ అనూహ్యంగా అప్పటి నుంచీ బడ్జెట్‌లు పెరిగాయే కానీ తగ్గలేదు. ఇక 2009 తర్వాత నుండి రవితేజ సినిమాలతో సహా 20 కోట్లు బడ్జెట్ అనేది సాధారణం అయిపోయింది. ఇక 2010లో సినిమా నిర్మాణ వ్యయంలో ఆ మొత్తం 30 నుండి 35 కోట్లకు పెరిగింది. మహేష్ ఖలేజా, ఆరెంజ్, కొమురంపులి, బద్రినాధ్, శక్తి, వరుడు వంటి సినిమాలన్నీ ఈ 35 కోట్ల మైలురాయికి అటు ఇటుగా వచ్చాయి. సినీపెద్దలు, విశే్లషకుల హెచ్చరికలను నిజం చేస్తున్నట్టుగా ఈ సినిమాల వ్యాపారం అంత భారీ స్థాయిలో జరగక పరిశ్రమ అంతా ఒక్కసారిగా నిస్తేజమయ్యే పరిస్థితి వచ్చింది. ఆఖరికి నిర్మాణ వ్యయాల్లో ఈ పెరుగుదలకు నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఒకరినొకరు నిందించుకోవాల్సిన అగత్యం దాపురించింది. దీంతో తెలుగు సినీ పరిశ్రమ ఎన్నో అడుగులు వెనక్కి వెళ్లింది. అయితే ఈ వెనుకంజ ఓ గొప్ప ‘దూకుడు’ కోసమే అని ఎవరికీ తెలీదు.
భారీ కలెక్షన్లు
తెలుగు సినిమా స్టామినా, బాక్సాఫీసు కలెక్షన్ల రేంజ్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే వస్తోంది. అప్పట్లో ఎన్టీఆర్ ‘అడవిరాముడు’ సినిమా 4 కోట్ల కలెక్షన్లు చేసేంతవరకు తెలుగు సినిమా రేంజ్ అంత ఉంటుందనీ తలపండిన ప్రముఖులకు సైతం తెలీదు. అలాగే చిరంజీవి ‘ఘరానామొగుడు’ పదికోట్ల కలెక్షన్లు దాటినప్పుడు, ఆ తర్వాత ‘ఇంద్ర’ 20 కోట్ల కలెక్షన్లు చేసినపుడు అందరికీ అదే ఆశ్చర్యం! ఇక, మహేష్‌బాబు ‘పోకిరి’ సినిమా 32 కోట్లు వసూలు రాబట్టడం పరిశ్రమలో భారీ రికార్డుగా రుజువైంది. కానీ ‘అరుంధతి’ సినిమా 35 కోట్లకు పైగా వసూళ్లు సాధించి తెలుగు సినిమాకి పెరిగిన రేంజ్‌ని నిరూపించింది. ఆ వెంటనే వచ్చిన రామ్‌చరణ్ ‘మగధీర’ సినిమా 68 కోట్లకుపైగా వసూలు చేసి తెలుగు సినీ పరిశ్రమ రేంజ్‌ని పునర్నిర్వచించింది. అలా ‘మగధీర’ సినిమా తెలుగు సినీ పరిశ్రమకు ఓ బెంచ్‌మార్క్‌ను నిర్దేశించింది. దాంతో భారీ ఇనె్వస్టమెంట్‌లతో భారీ రిటర్న్‌లు వస్తాయనే ఆలోచన నిర్మాత, దర్శకులు, హీరోలలో మొదలైంది. అంతేకాక, ఇప్పటి యంగ్ హీరోలలో ఉన్న ఆరోగ్యకరమైన పోటీతో ‘మగధీర’ రికార్డును బ్రేక్ చేయాలనే సంకల్పంతో అందరు హీరోలు తమదైన తరహాలో భారీ సినిమాలు చేశారు. కానీ అవన్నీ నిరాశనే మిగిల్చాయి. హైజంప్‌లో రికార్డు సృష్టించాల్సిన ఆటగాడు అప్పుడు ఐదడుగులు వెనక్కి వేయాల్సి వచ్చింది.
ఇప్పుడు గొప్ప ‘దూకుడు’!
మహేష్‌బాబు-శ్రీనువైట్ల కాంబినేషన్‌లో యాక్షన్ కామెడీగా వచ్చిన ‘దూకుడు’ సినిమా కనివినీ ఎరుగని రీతిలో కలెక్షన్ల పరంగా ఎంతో ఎత్తుకు చేరుకుంది. మొదటివారంలో 50 కోట్ల పైగా వసూళ్లు చేసిన ఈ సినిమా రెండో వారం నాటికి 70 కోట్లను దాటి 85కోట్ల దిశగా ఎగిసింది. ఇప్పుడు తెలుగు సినిమా బాక్సాఫీసు కలెక్షన్ల స్టామినా దాదాపు 85 కోట్లకు చేరుకున్నదన్న మాట!
ఈ మొత్తం బాలీవుడ్ సూపర్‌హిట్ సినిమాల కలెక్షన్లకు దాదాపు సమానం అని చెప్పాలి. జాతీయస్థాయిలో దేశవ్యాప్తంగా ఆడియన్స్‌ని, మార్కెట్‌నీ కలిగి వున్న బాలీవుడ్ సినిమా 85 కోట్లను వసూలు చేయడంలో పెద్ద విశేషమేం లేదు. కానీ, 9 కోట్ల ప్రజలతో ఓ ప్రాంతానికే పరిమితమైన తెలుగు సినిమా ఆ స్థాయి కలెక్షన్లను సాధించడం మాత్రం ఖచ్చితంగా విశేషమే! బాలీవుడ్‌లో సూపర్ డూపర్ హిట్ లైన అమీర్‌ఖాన్ ‘గజినీ’ సల్మాన్‌ఖాన్ ‘వాంటెడ్’, ‘రెడీ’, ‘బాడీగార్డ్’ సినిమాలు, ఫారుఖ్‌ఖాన్ ‘రబ్‌నె బనాదీ జోడీ’, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ వంటివన్నీ 85 కోట్ల కలెక్షన్లు సాధించినవే! ఆ లెక్కన ఇప్పుడు తెలుగు సినిమా రేంజ్ విస్తరించిదనడంలో సందేహం అక్కర్లేదు.
నిజమైన బలుపేనా?
ఐతే తెలుగుసినిమా రేంజ్‌ని కొత్తగా నిర్వచిస్తున్న ఈ 85 కోట్ల బెంచ్‌మార్క్ చెప్పుకోడానికి బాగానే ఉంది కానీ వ్యాపార-వాణిజ్య సూత్రాల ప్రకారం ఇది నిజమైన సాధనేనా అనేది ప్రశ్నగా ఉంది. తెలుగు సినిమా ఓ బిజినెస్ అనుకున్నప్పుడు, ఆ బిజినెస్ సూత్రం ప్రకారం పెట్టుబడికి వచ్చే ఆదాయానికి మధ్య వచ్చే తారతమ్యమే కొలమానం కావాలి. ఆ ప్రకారంగా చూస్తే ‘దూకుడు’ వంటి సినిమాల నిర్మాణ వ్యయాన్ని ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి. అలా చూస్తే మూడు రెట్ల లాభం మాత్రమే వచ్చినట్టు లెక్క (అంటే పెట్టుబడి దాదాపు 30 కోట్లు కాగా ఆదాయం 85 కోట్లు). సినీ ట్రేడ్ పండితులు ఈ విషయాన్ని వివరించడానికి ‘అలా మొదలైంది’ సినిమాని ఉదాహరణగా చెబుతున్నారు. ఈ సినిమా నిర్మాణ వ్యయం 3 కోట్లు కాగా, రాబడి పదికోట్లకు పైగా వచ్చింది. అంటే దాదాపు4 రెట్లు అన్నమాట! అందుకే ట్రేడ్ నిపుణుల పరంగా ప్రస్తుత తెలుగు సినిమా వ్యాపారం ఎలా ఉన్నా, ‘దూకుడు’తో మాత్రం దాని ‘రేంజ్’ చాలా పెరిగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.                                                       - మామిడి హరికృష్ణ

ఇది కొత్త ట్రెండ్‌కి శ్రీకారమా?

ప్పుడొక కొత్త ట్రెండ్(?)కి తెర తీశారు...ఈ దసరాకి విడుదలైన రెండు భారీ ప్రతిష్టాత్మకాలు యాదృచ్ఛికంగా ఒకే పంథాననుసరించి ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఓ సినిమాని సాంతం ఇంకో సినిమాననుసరించి అంటే పరాయి సినిమా కథని చోరీ చోరీ చుప్కే చుప్కేగా చటుక్కున స్వీక(తస్క)రించి తీర్చిదిద్దడం అమల్లో ఉన్న ఆనవాయితీ. ఇప్పుడా పరాయి సొత్తుని సినిమా కథలో ఓ భాగంగానో లేదా ఫ్లాష్‌బ్యాక్‌గానో ప్రధాన కథకి అనుగుణంగా కుదించుకుని, గొప్పగా ఫీలవ్వడం ఆ ఆనవాయితీకో కొత్త మలుపు. దీన్ని దర్శకుడు శ్రీనువైట్ల ఇన్‌స్పిరేషన్‌గా చెప్పుకుని గర్విస్తున్నారు. ఇలాంటి ఇన్‌స్పిరేషన్‌ల వ్యవహారానే్న కొందరు అత్యుత్సాహవంతులు ఇంటర్నెట్‌లో టప టపా కొట్టేసి అవతల ఆయా ఒరిజినల్ సృష్టికర్తలకు క్షణాలమీద అందించేస్తున్నారు. ఇదెక్కడికి దారి తీస్తుందో తెలీదు. బాలీవుడ్‌లో ఈ తస్కరణ పైత్యమే ముదిరి, హాలీవుడ్ స్టూడియోలనుంచి తాఖీలందుకున్నాక తాళాలు పడ్డాయి. ఎక్కడో మారుమూల తెలుగు సినిమాల వ్యవహారం ఎవరికి తెలుస్తుందిలే అనుకోవడానికి వీల్లేదు. తెలుగు సినిమాల్ని ఇప్పుడు ‘ప్రపంచవ్యాప్తంగా’ విడుదల చేసే స్థాయికి తీసుకెళ్లాక ఏమైనా జరగొచ్చు. అమెరికాలో ‘దూకుడు’ విజయ దుందుభికి అక్కడి ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికే ఆశ్చర్యపోయి వార్త రాసింది. ముంబాయి క్రిటిక్స్ కూడా ‘దూకుడు’ ఘనవిజయ కారణాలేమిటో స్వయంగా సినిమా చూసి విశే్లషించాలని తహతహలాడుతున్నారు. తమకోసం ప్రత్యేకంగా ఓ షో వేయాలని కోరుతున్నారు. ‘దూకుడు’ సంచలన సక్సెస్‌కి కారణం దాని కంటెంటా, లేక మేకింగ్ స్కిల్సా తేల్చుకోవాలని ఎదురు చూస్తున్నారు. ఇదే జరిగితే రేపు జాతీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి గుట్లు రట్టు చేస్తారో తెలీదు.
దూకుడునో, ఊసరవెల్లినో ఎవరికో పట్టించాలని ఈ వ్యాసం ఉద్దేశం కాదు. పైరసీ ఎంత సహజమో, కథా చౌర్యమూ అంతే సహజంగా మారిపోయింది. రెండూ ఒకే ఆత్మకి రెండు శరీరాలు. కానీ కథని చోరీ చేసిన శరీరం, పైరసీకి పాల్పడిన శరీరాన్ని హెచ్చరిస్తుంది. చట్టాల పేర్లు చెప్పి దాడులు చేస్తుంది. ఒక సినిమా కథకీ అంతే పకడ్బందీగా కాపీ రైట్ చట్టాలుంటాయన్నది తెలివిగా మరుగుపరుస్తుంది. పాపం నోరూ వారుూ లేని పైరసీ శరీరం తానొక్కతే దోషి గా ప్రపంచం ముందు నిలబడుతుంది. ఆత్మకి మాత్రం ఒక సందేహ మెప్పుడూ మిగిలే ఉంటుంది. ఒక శరీరం చోరీ చేసిన సొత్తుని, ఇంకో శరీరం చోరీ చేస్తే, దాన్ని చోరీ అని ఎందుకంటారని. అది బై ప్రొడక్టే కదా?
దూకుడు, ఊసరవెల్లి అనే రెండు దసరా సినిమాలూ యాదృచ్ఛికంగా అనుసరించిన కొత్త పంథా బాగోగుల్ని తెలియపరచడమే ఈ వ్యాసం ఉద్దేశం. ‘దూకుడు’ వెబ్ సైట్ ప్రకారం ఈ సినిమా కోసం ఎనె్నన్నో కథలనుకున్నారు. కొన్ని కథలు తయారుచేసి పక్కనపడేశారు. ఎంతోకాలం గడిచిపోయింది. చివరికి మొదట్లో అనుకున్న కథే ఫైనల్ చేసుకున్నారు. ఈ ఫైనల్ చేసుకున్న కథా విశేషాలు తప్పించి, మిగతా వాటికి జరిగిన గ్రంథ పఠనం, పాత క్లాసిక్స్ వీక్షణం వంటి ప్రక్రియలన్నీ వివరించుకొచ్చారు. కానీ ఎందుకో ఫైనలైన కథ అదెలా ఫైనల్ అయిందీ చెప్పలేదు. తీరా సినిమా విడుదలయ్యే వరకూ మనకి తెలీదు-అందులో జర్మన్ ట్రాజీ-కామెడీ ‘గుడ్‌బై లెనిన్’ కథ వచ్చేసి జొరబడి పోయందని! 2003లో విడుదలై అనేక ప్రశంసలూ, అవార్డులూ అందుకున్న ‘గుడ్‌బై లెనిన్’ చారిత్రక నేపథ్యమున్న కథ, అందులో ఒక కమ్యూనిస్టు నాయకురాలు కొడుకుని పోలీసులు కొట్టడం చూసి తట్టుకోలేక షాక్‌తో కోమాలోకెళ్లిపోతుంది. ఆమె కోమాలో ఉన్న కాలంలో బెర్లిన్ గోడ కూలి, ఉభయ జర్మనీలూ ఒకే దేశంగా అవతరిస్తాయి. కమ్యూనిజం అంతరించి క్యాపిటలిజం వేళ్ళూనుతుంది. దేశ రాజకీయ, సాంస్కృతిక స్వరూపాలే మారిపోతాయి. ఎనిమిది నెలల తర్వాత కళ్లు తెరిచిన ఆమెకి ఎలాటి దుర్వార్త తెలిసినా గుండెపోటు రావచ్చని హెచ్చరిస్తారు డాక్టర్లు. దాంతో హీరో అయిన కొడుకు ఆమెని గదిలో పడకమీద వుంచి, ఆమెకి తెలిసిన జర్మనీయే ఉందని చెప్పి నమ్మిస్తుంటాడు. ఇందుకోసం చెల్లెలితో, ప్రియురాలితో కలిసి అనేక నాటకాలాడుతుంటాడు. దర్శకుడు వుల్ఫ్‌గ్యాంగ్ బెకర్ ఎంతో ఇంటిలిజెంట్‌గా, లాజికల్‌గా బాగా నవ్వించే దృశ్యాలు సృష్టిస్తాడు. ఇదెక్కడి దాకా పోతుందంటే, నాటకాలేసీ
వేసీ అలసిపోయిన హీరో, ఆ తల్లి చనిపోతే బావుండుననే స్థితికొస్తాడు. ఎంత నవ్విస్తుందో, అంత కంట తడిపెట్టించే జీవమున్న ట్రాజీ-కామెడీ ఇది.
‘దూకుడు’లో దీన్ని ప్రకాష్‌రాజ్-మహేష్‌బాబుల ఎపిసోడ్‌గా పెట్టుకున్నారు. రాజకీయ నాయకుడైన ప్రకాష్‌రాజ్ 14 ఏళ్ల తర్వాత కోమాలోంచి మేల్కొన్నాక, అతడ్ని డిస్టర్బ్ చేసే విషయాలు తెలిస్తే గుండెపోటు రావచ్చునని చెప్తారు డాక్టర్లు. దాంతో కొడుకు పాత్రలో మహేష్‌బాబు ప్రకాష్‌రాజ్ శ్రేయస్సుకోసం, అదే 14 ఏళ్లనాటి రాష్ట్ర పరిస్థితిని నమ్మిస్తూ, తను ఎమ్మెల్యేగా నటిస్తూ రియాల్టీ షో పేరుతో ఒక వర్చువల్ ప్రపంచాన్ని సృష్టిస్తాడు. ఈ ప్రపంచంలో ఇప్పుడు ఎన్టీఆర్ బ్రతికే ఉంటాడు. కాకపోతే దేశ ప్రధానిగా ఉంటాడు. ప్రకాష్‌రాజ్ అభిమాన ఎన్టీఆర్ గురించి ఈ మంచి విషయాలు, మహేష్‌బాబు ఎమ్మెల్యే అయి ప్రకాష్‌రాజ్ కోర్కె తీర్చిన శుభ పరిణామం ఇత్యాదివన్నీ ప్రకాష్‌రాజ్ నమ్మేస్తూ బ్రతికేస్తూంటాడు. అయితే ఈయన ఆనాడే చనిపోయాడని కుటుంబం ప్రపంచాన్ని నమ్మించింది. విగ్రహం పెట్టి ఇప్పుడు కూడా వూరి జనాన్ని నమ్మిస్తూ, 15వ సంవత్సరీకం జరపబోతున్నారు...ఇదీ విషయం. ఇంకా చాలా లాజిక్‌లేని, అర్ధం పర్ధంలేని అంశాలు అనేకం ఉంటాయి.ప్రధానంగా ప్రకాష్‌రాజ్ లేచి ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు. చేతిలో దినపత్రిక కూడా ఉంటుంది. ఈ మొత్తం ఎపిసోడ్ కాకమ్మ కథలా ఉంటుంది.
సినిమాల్లో-ఆ మాటకొస్తే కామెడీకి అంతగా లాజిక్ పట్టించుకోవద్దంటారు నిజమే, కానీ ఎప్పుడు పట్టించుకోవద్దు? మనకి ఎప్పుడు నవ్వొస్తుంది? జోక్ ఎప్పుడు పేలుతుంది? వీటి బీజం లాజికల్‌గా ఉన్నప్పుడే. ఆరిస్టాటిల్ ప్రకారం, ఒక హాస్య ప్రహసనానికి బేస్ లాజికల్‌గా ఉంటే, దాన్ని ఆసరాగా చేసుకుని ఎంత అసంబద్ధ కామెడీనైనా సృష్టింవచ్చు. అదే బేస్ అసంబద్ధంగా ఉంటే, ఎలాంటి కామెడీకి నవ్వు రాదు. దూకుడులో మహేష్‌బాబు సృష్టించిన వర్చువల్ ప్రపంచం ఇలాంటి బేస్ లేనిదే. జర్మన్ సినిమాకి ఈ బేసే ప్రాణమైంది. అయినా ‘దూకుడు’ని చూసి ప్రేక్షకులు తెగ నవ్వుతున్నారంటే దాన్ని వాళ్ల విజ్ఞతకే వదిలెయ్యాలి.
జర్మన్ సినిమా ‘దూకుడు’లో పొసగని ఒక భాగంగా ఇరుక్కుంటే, ‘ఊసరవెల్లి’లో హాంకాంగ్ దర్శకుడి హాలీవుడ్ సినిమా ఫ్లాష్‌బ్యాక్ అయింది. జానీ టో దర్శకత్వం వహించిన ‘వెంజెన్స్’లో హాంకాంగ్‌లోని ఒక ఫ్రెంచి కుటుంబం మీద దుండగులు దాడి చేస్తారు. ఆమె గాయపడి, ఆమె భర్త్తా పిల్లలూ చనిపోయి, దీనావస్థలో ఆ హంతకుల మీద పగ తీర్చుకోమని తండ్రిని వేడుకుంటుంది. తండ్రి కుక్. అతనెప్పుడో కిల్లర్‌గా ఉండేవాడు. ఇప్పుడు ఓపిక లేదు. అయినా కన్న కూతురికి జరిగిన దానికి చేవ తెచ్చుకుని, ముగ్గురు కిల్లర్స్‌ని మాట్లాడుకుని, శత్రు సంహారం మొదలెడతాడు.
దీన్ని జూనియర్ ఎన్టీఆర్ ఫ్లాష్‌బ్యాక్‌గా పెట్టినప్పుడు, ఇందులో కథంతా హీరోయిన్ తమన్నాదే. ఆమె అన్న కుటుంబాన్ని మాఫియాలు హతమారుస్తారు. ఆమె తీవ్రంగా గాయపడి మతి స్థిమితం కోల్పోయి, ప్రతీకారం కోసం అంగలారుస్తున్నప్పుడు, చివర్లో చిల్లర నేరస్థుడి పాత్రలో ఎన్టీఆర్ తారసపడతాడు. మాఫియాల్ని చంపమని అతడ్ని బతిమాలుతుంది. అతను ఒప్పుకుని బయలుదేరుతాడు. దాంతో ఈ ఫ్లాష్‌బ్యాకే కాదు, మొత్తం సినిమా అంతా తమన్నా కథగా మారిపోయి ప్రేక్షకులు హాహాకారాలు చేశారు. ఒరిజినల్‌లో ఉన్న తండ్రీ కూతుళ్ల మధ్య ఎటాచ్‌మెంట్ లాంటిది ఇక్కడ కుదరకపోవడం, హీరో లక్ష్యం- పోరాటం-పాత్ర సమస్తం సెకండ్ హేండ్‌గా మారిపోవడం వంటి దుష్పరిణామాలకి దారి తీసిందీ ఫ్లాష్ బ్యాక్.
ఒక కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టారు. దీన్ని కాపీ అనకుండా ఇన్‌స్పిరేషన్ అనే అనుకుందాం. కానీ ఇన్‌స్పిరేషన్స్ ఇంత నిస్సారంగా ఉంటాయా? వీటినే సినిమాలనుకోవాలా?                              -సికిందర్

'ప్రైవేట్' లంచాలపై ఉక్కుపాదం

క్రిమినల్ కేసులుగా నమోదు అనుగుణంగా చట్టాల్లో మార్పులు అవినీతి విషయంలో రాజీ లేదు ప్రజా చైతన్యం శుభ పరిణామం సిబిఐ, ఎసిబి సమావేశంలో మన్మోహన్
న్యూఢిల్లీ, అక్టోబర్ 22: ప్రైవేటు రంగం ముడుపులు ఇవ్వడాన్ని నేరంగా చేయడానికి వీలుగా చట్టంలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. అవినీతిపై ఐక్యరాజ్య  సమితి ఒడంబడికకు భారత్ ఆమోదముద్ర వేసిందని, దీన్ని అమలు  చేయాలంటే అవినీతికి సంబంధించిన పలు చట్టాలను సవరించాల్సిన  అవసరం ఉందని ప్రధాని చెప్పారు. అందులో భాగంగా విదేశీ ప్రతినిధులకు ముడుపులు ఇవ్వడాన్ని నేరంగా పరిగణించడానికి వీలుగా ఇప్పటికే  పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టామన్నారు. అలాగే ప్రైవేటు రంగం
లంచాలివ్వడాన్ని కూడా నేరంగాచేస్తూ చట్టాల్లో మార్పులు తీసుకు  రావాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. అయితే ప్రైవేటు రంగంలో లంచాలను ఎలా నిరోధిస్తారో మాత్రం ప్రధాని వివరించలేదు. శుక్రవారం ఇక్కడ రాష్ట్రాల అవినీతి నిరోధక విభాగాలు, సిబిఐ ఉన్నతాధికారుల సమావేశంలో ప్రధాని ప్రసంగించారు. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠను మంటగలుపుతూ ఆర్థికాభివృద్ధికి ప్రధాన అవరోధంగా నిలుస్తున్న అవినీతి విషయంలో రాజీ పడబోమన్న ప్రధాని స్పష్టం చేశారు. అయితే ఈ చీడపురుగును పూర్తిగా నిర్మూలించలేమని పేర్కొన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం గణనీయంగా పెరిగినప్పటికీ ఆశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉందని
అభిప్రాయపడ్డారు.ప్రభుత్వం అవినీతిని కట్టడి చేయటానికి గట్టి చర్యలు తీసుకుంటోందని, అయితే నిర్ణయాలను తీసుకోవటంలో జరుగుతున్న తప్పిదాలు అవినీతికి, అధికార దుర్వినియోగానికి ఆస్కారం ఇస్తున్నాయని చెప్పారు. అవినీతిని అదుపుచేసే ప్రక్రియలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారుల వద్ద ఉన్న విచక్షాణాధికారాలను కుదించనున్నట్టు చెప్పారు. అంతేకాక వేలాది కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టే ప్రభుత్వ పధకాలను మంజూరు చేయటానికి పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ చట్టాన్ని అమలు చేయనున్నామని, అతి త్వరలోనే పార్లమెంట్‌లో బిల్లును
ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని ప్రధాని చెప్పారు. గతంలోకంటే అవినీతికి వ్యతిరేకంగా సమాజంలోని వివిధ వర్గాలు ఉద్యమిస్తున్న తీరు ప్రజాస్వామ్య భవితవ్యానికి మంచిదని ప్రధాని  అభిప్రాయపడ్డారు. ప్రజా చైతన్యాన్ని శుభ సంకేతంగా పరిగణించి ప్రభుత్వం అవినీతిపై ఉక్కుపాదం మోపటానికి అన్ని చర్యలను తీసుకుంటోందన్నారు. అవినీతికి దారితీసే నిర్ణయాలకు స్వస్తి చెప్పిన పక్షంలో అవినీతి బాగా తగ్గుతుందని మన్మోహన్ అభిప్రాయ పడ్డారు.
‘ప్రభుత్వం పారదర్శకతతో వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో కీలకపాత్ర వహించే అధికారులు సక్రమంగా తమ విధులను నిర్వహిస్తే మంచి ఫలితాలు లభించి  తీరుతాయి’ అని  వ్యాఖ్యానించారు.  ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని బలమైన ఆయుధంగా వినియోగించుకుంటే అవినీతి దానంతటదే దారికి వస్తుందని ప్రధాని చెప్పారు. ప్రజలు అడిగిన ప్రతి విషయంపై పూర్తి  సమాచారాన్ని బహిరంగం చేయటానికి అధికారులు తటపటాయించవద్దని  సూచించారు. అవినీతిపరులు ఏదో ఒక రోజు చట్టానికి దొరికి తీరుతారని  ఆయన స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడిన వారిపై పెట్టిన కేసుల  విచారణను వీలైనంత త్వరితంగా పూర్తిచేసి శిక్ష పడేట్టు చేయాలని ఆయన  చెప్పారు. సిబిఐ వద్ద పదేళ్లకు పైబడి పెండింగ్‌లో ఉన్న కేసులను
పరిశీలించి వీటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు  పదవీ విరమణ చేసిన సుప్రీమ్‌కోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన ఒక కమిటీని నియమించినట్టు చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించే
వారికి రక్షణ కల్పించే చట్టాన్ని తీసుకువస్తున్నామన్నారు. అవినీతికి సంబంధించిన కేసులను విచారించి దోషులకు శిక్ష పడేట్లు చేయటంలో సిబిఐ అత్యంత నైపుణ్యంగా పని చేస్తూ అంతర్జాతీయంగానే మంచి  గుర్తింపు పొందుతోందని ప్రశంసించారు. లోక్‌పాల్ వ్యవస్థ అవిర్భవించినప్పటికీ సిబిఐ దేశంలో అత్యున్నతమైన విచారణ సంస్థగా
ప్రభుత్వానికి సేవలు అందిస్తుందని ప్రధాని నిష్కర్షగా చెప్పారు. ఒత్తిడులకు లొంగకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సిబిఐ పని చేయాలన్నారు. అవినీతిపరుల పాలిట సింహస్వప్పంగా మారిన సిబిఐపై
ప్రజలకు, ప్రభుత్వానికి విపరీతమైన నమ్మకం విశ్వాసం ఉన్నాయని ఆయన చెప్పారు.

డయల్.. 1964
లంచాల బాధితుల కోసం త్వరలో సివిసి హెల్ప్‌లైన్ 

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: లంచాల కోసం అవినీతిపరులు మిమ్మల్నివేధించుకుతింటున్నారా? మీ పనులు ఆలస్యం చేస్తున్నారా? అయితే 1964 హెల్ప్‌లైన్ టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌చేస్తే సరి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సివిసి) అధికారులు వారి భరతం పడతారు. సివిసి త్వరలోనే  అందుబాటులోకి తీసుకురానున్న ఈ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నెంబర్ ద్వారా  అవినీతి బాధితులకు నిరంతర సేవలు అందుతాయి. అవినీతికి  సంబంధించిన అన్ని రకాల ఫిర్యాదులను ఈ హెల్ప్‌లైన్ పరిష్కరిస్తుందని  సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అధికారులు తెలిపారు. వివిధ ప్రభుత్వ  విభాగాల్లో లంచగొండులకు ముడుపులు ముట్టజెప్పలేక, సకాలంలో పనులు పూర్తిగాక ఇబ్బందులు పడే బాధితులకు ఈ హెల్ప్‌లైన్ అండగా నిలుస్తుందని సివిసి అధికారులు చెప్పారు. ఈ హెల్ప్‌లైన్ ద్వారా బాధితులకు 24 గంటలూ సేవలను అందించేందుకు ఒక పూర్తిస్థాయి కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు వారు తెలిపారు. ప్రభుత్వ
విభాగాల్లోనూ, ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ లంచగొండుల నుంచి  ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఎవరైనా ఈ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌చేసి తమ సమస్యలపై ఫిర్యాదులు చేసుకోవచ్చన్నారు. అయితే ఢిల్లీ ప్రభుత్వం, దాని
విభాగాలు ఈ హెల్ప్‌లైన్ పరిధిలోకి రావని, కనుక వాటిని ఈ హెల్ప్‌లైన్ ద్వారా పరిష్కరించడం జరగదని సివిసి అధికారులు తెలిపారు.

నన్ను చంపు


మల్లాది మిరియాలు --- మల్లాది వెంకట కృష్ణమూర్తి 


బ్రెట్ డిలేన్ సింహద్వారం తలుపు తెరచుకుని తన ఇంట్లోకి ప్రవేశించాడు. తలుపు మూసి హాల్లోని లైట్‌ని వేసాడు. ఇంట్లోని అతని ఆఫీసు గది తలుపు కింద నించి లోపల లైటు వెలుగుతున్న కాంతి కనిపించింది. తక్షణం అది మాయం అయింది.
తను ఆ లైటు ఆర్పలేదా? తను చూస్తూండగానే బల్బ్ మాడిపోయిందా? ఆలోచిస్తూ బ్రెట్ డీలేన్ ఆ గది తలుపు దగ్గరకి వెళ్ళి దాన్ని తెరిచాడు. అతనికి లోపల దొంగ ఉండచ్చనే ఆలోచన కలిగితే వెంటనే పోలీసులకి ఫోన్ చేసేవాడు. ఐతే లాస్ ఏంజెలెస్‌లో, బెవర్లి హిల్స్‌లో ప్రధానంగా నటీనటులు నివసించే ఆ కాలనీలో దొంగలు పడటం గురించి బ్రెట్ ఎన్నడూ వినలేదు. కాబట్టి అది దొంగ పని ఆవచ్చన్న అనుమానమే కలగలేదు.
ఆ గదిలోకి వెళ్ళి స్విచ్ నొక్కాడు. ఎదురుగా గోడకి ఓ మూల నక్కి ఉన్న ఓ పద్దెనిమిదేళ్ళ కుర్రాడు కనిపించాడు. అతని చేతిలో పిస్తోలు, కళ్ళల్లో భయం కనిపించాయి. ఆ గది కిటికీ తలుపు అద్దం పగిలి ఉండటం కూడా బ్రెట్ గమనించాడు.
బ్రెట్ అతనితో మాట్లాడటానికి నోరు తెరిచాడు. మరుక్షణం బాధగా గుండె దగ్గర చేతిని వేసి వెనక్కి తూలి, వెనక గోడకి ఆనించి వేసిన సోఫాలో పడ్డాడు. లైట్ పేంట్స్, మురికి జాకెట్ వేసుకుని ఉన్న ఆ యువకుడు బ్రెట్ వంక నిశ్శబ్దంగా చూసాడు. అతను తన చేతిలోని పిస్తోలుని ఏ క్షణంలోనైనా పేల్చడానికి సిద్ధంగా ఉన్నాడు.
బ్రెట్ తేరుకోడానికి అర నిముషం పట్టింది. ఆయన లేచి తూలుతూ నెమ్మదిగా బల్ల వెనక ఉన్న రివాల్వింగ్ చెయిర్‌లో కూలబడ్డాడు. తర్వాత దాని డ్రాయర్‌ని తెరవడానికి దాని హేండిల్ మీద తన చేతిని వేసాడు.
‘‘డేడ్! దాన్ని తెరిస్తే గుండు నీ గుండెల్లో దిగుతుంది.’’ వెంటనే హెచ్చరికగా చెప్పాడా యువకుడు.
‘‘మందు. నా మందు...’’ బ్రెట్ ఆక్రోశించాడు.
‘‘ఏం మందు?’’
‘‘గుండె నొప్పికి నాలిక కింద ఉంచుకునే మందు. ఇది.’’
మాట్లాడుతూనే బ్రెట్ డ్రాయర్ లాగి అందులోంచి చిన్న డబ్బాని తీసాడు. దాన్ని తెరచి అందులోని ఓ మాత్రని నోట్లో నాలిక కింద ఉంచుకున్నాడు. సీట్‌లో నీరసంగా కళ్ళు మూసుకుని వెనక్కి వాలిపోయాడు.
వెండి రంగు జుట్టు గల ఆ వృద్ధుడి వంక ఆ యువకుడు నిశ్శబ్దంగా చూస్తుండిపోయాడు. ఆయన నటుడని ఆ గదిలోని అనేక షీల్డ్‌లనిబట్టి గ్రహించాడు. ఐతే ఆయన నటించిన సినిమాలు విడుదలయ్యే కాలంలో ఆ యువకుడు పుట్టనే లేదు.
బ్రెట్ నటించిన అనేక కేరక్టర్ రోల్స్‌గల చిత్రాలు ఆ గదిలో గోడల నిండా అలంకరింపబడి ఉన్నాయి. ‘పాత కాలం నటుడు’ అనుకున్నాడు. బ్రెట్ డిలేన్ అనే పేరు కూడా ఆ యువకుడు ఎన్నడూ వినలేదు.
చిన్నగా మూలిగి కళ్ళు తెరచి బ్రెట్ ఆ యువకుడ్ని అడిగాడు.
‘‘నీకేం కావాలి?’’
‘‘దొంగతనం చేయడానికి వచ్చాను. బంగారం, నగదు.’’
‘‘నీకేం కావాలో అవి తీసుకుని వెళ్ళిపో.’’
‘‘సరే. కాని ముందుగా నిన్ను చంపి.’’
బ్రెట్ ప్రశ్నార్థకంగా చూసాడు.
‘‘సాక్షి సాక్షి నన్ను కటకటాల వెనక్కి పంపగలడు. జైలుకి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. అందుకని...’’ ఆపేసాడు.
‘‘నన్ను చంపదలచుకున్నావా?’’
‘‘అవును.’’
‘‘నేను చావుకి సమీపంలోనే ఉన్నాను. ఇది మూడోసారి నాకు హార్ట్ అటాక్ రావడం. ఈ మందు వేసుకుంటే నాకు అన్నిసార్లు రిలీఫ్ కలిగేది. గుండె సర్దుకునేది. కాని ఈసారి మాత్రం... నిన్ను చూసిన షాట్‌కి నాకు హార్ట్ అటాక్ వచ్చింది. మూడోసారి హార్ట్ అటాక్ వస్తే జీవించడం అంటూ ఉండదు.’’
‘‘అది అబద్ధం.’’
బ్రెట్ సన్నగా నవ్వాడు. ఆ నవ్వులో ఆ యువకుడికి కనిపించింది.
‘‘దేనికా నవ్వు?’’ అయోమయంగా చూస్తూ అడిగాడు.
‘‘పిల్లవాడా! బ్రెట్ డిలేన్ పేరు విన్నావా?’’
‘‘లేదు.’’
‘‘నన్ను తెరమీద సినిమాల్లో ఎప్పుడైనా చూసావా?’’
‘‘లేదు.’’
మళ్ళీ ఇందాకటిలా నవ్వాడు బ్రెట్.
‘‘ఐతే నువ్వు నాకు సహాయం చేస్తున్నావు. నన్ను చంపు. కాల్చు.’’
ఆ యువకుడి అయోమయం రెట్టింపైంది.
‘‘నేను నిన్ను చంపడం నీకు సహాయం చేయడం ఎలా అవుతుంది?’’ ప్రశ్నించాడు.
‘‘నాకు నీ చేతుల్లో చావడానికి రెండు కారణాలున్నాయి.’’
‘‘ఏమిటవి?’’
‘‘ఒకటి. నా ప్రాణాంతక రోగం కొద్దికొద్దిగా నన్ను బలహీనపరుస్తూ చంపుతోంది. ‘ఎప్పుడు చస్తానా?’’ అనే భయంతో మరణించేకంటే ఇలా ఒక్కసారిగా మరణించడంలో నాకు ఆనందం ఉంది.’’
‘‘రెండో కారణం?’’
‘‘నువ్వే.’’
‘‘అయోమయంగా మాట్లాడకు.’’
‘‘నిజం. నా పేరు నువ్వు వినలేదన్నావు. నా సినిమా చూడలేదన్నావు. నేను నటుడ్ని. నీకు తెలుసా? రెండువందల నలభై ఆరు సినిమాల్లో నటించిన నటుడ్ని. సెట్‌లో నాకోసం మిగతా నటీనటులు ఎదురుచూసేవారు. ప్రేక్షకులు నేనున్న సినిమాలకి నాకోసం వచ్చేవారు. నేను ఎక్కడికీ ఒంటరిగా, బాడీగార్డులు లేకుండా వెళ్ళగలిగేవాడిని కాను. ఆటోగ్రాఫ్‌లకోసం నన్ను ప్రజలు చుట్టుముట్టేవారు. 1974లో ఓ రోజు షికాగో ఎయిర్‌పోర్ట్‌లోని తోటి ప్రయాణీకులు ఆటోగ్రాఫ్‌లకోసం నన్ను చుట్టుముడితే...’’
బాధగా మూలిగి మళ్ళీ గుండెని పట్టుకున్నాడు. గట్టిగా ఊపిరిపీల్చుకుని వదిలి, నుదుట పట్టిన చెమటని తుడుచుకుని మళ్ళీ కొనసాగించాడు.
‘‘నా విమానం నాకోసం పావుగంటసేపు ఆగాల్సి వచ్చింది. సెక్యూరిటీ పోలీసులు వచ్చి నన్ను వాళ్లనించి వేరుచేసి, నా విమానంలోకి ఎక్కించారు. మర్నాడు ఆ వార్త పేపర్లో వచ్చింది. ఇటీవల ఇంతటి అభిమానంగల నటీనటులే లేరు. ఐనా నువ్వు నా పేరు వినలేదు. నా మరణవార్త గురించి రేపు దినపత్రికలో లోపలి పేజీల్లో ఎక్కడో ఓ అరంగుళం జాగాలో వేస్తే దాన్ని ఎవరూ చదవరు. చదివినా నేనెవరో ఎవరికీ తెలీదు.’’
‘‘ఐతే?’’
‘‘అర్థం కాలేదా? ఏ నటుడికైనా గుర్తింపు ముఖ్యం. దానే్న కీర్తి అంటారు. గుండాగి సహజంగా మరణించేకంటే నేను హత్యచేయబడితే నా మరణవార్త మొదటి పేజీలో వేస్తారు. నా చిత్రాల్లోని పాపులర్ సినిమాల గురించి ప్రస్తావిస్తారు. నేను లిండన్ జాన్‌సన్ ఆహ్వానం మీద వైట్‌హౌస్‌కి వెళ్ళి ఆయనతో టీ తీసుకున్న ఫొటో వేస్తారు.’’
బ్రెట్ డిలేన్ కంఠం గద్గదమైంది. ఆయన కళ్ళవెంట నీళ్ళు కారుతున్నాయి.
‘‘నా చేతి వేళ్ళల్లోంచి జరిపోయిన కీర్తి. నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్న కీర్తి, జారిపోవడం చూస్తూ ఇనే్నళ్ళుగా నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా?’’
బ్రెట్ దీర్ఘంగా నిట్టూర్చాడు.
‘‘నేను మరణించడం తప్పదు. దానికి దగ్గరగా కూడా వచ్చాను. కాబట్టి నన్ను కాల్చు, అహంకారంగల ఏ నటుడూ ఇంతకంటే ఇంకోటి కోరడు.’’
‘‘నీకు పిచ్చెక్కింది.’’
‘‘ఓ పాత్ర తెరమీదకి ప్రవేశించిన విధానంకన్నా ఆ పాత్ర నిష్క్రమించే విధానమే ప్రేక్షకుడికి గుర్తుండిపోతుంది. రోమన్ హాలీడే చూసావా? చివర్లో గ్రెగరి పెక్ రాజప్రసాదంలోంచి నిశ్శబ్దంగా జేబుల్లో చేతులు ఉంచుకుని, నడిచి వెళ్తూంటే కేవలం అతని బూట్ల చప్పుడే వినిపిస్తుంది. ఆ సినిమా చూసిన వారెవరూ గ్రెగరీని మర్చిపోలేరు. కసబ్లాంకా చూసావా? అందులో హంప్రిబోగర్ట్ తన ప్రియురాలిని ఆమె ప్రియుడితో విమానంలో పంపించి చేసిన త్యాగం, ఆ తర్వాత అతను దూరంఅయ్యే విమానం వంక చూసిన తీరు... కసబ్లాంకా ఆల్‌టైమ్ క్లాసిక్ సినిమా అయింది. హంఫ్రి ప్రేక్షకులకి గుర్తుండిపోయాడు. ఓనాటి గొప్ప నటుడు, ఒంటరి ఇంట్లో ఓ సామాన్య దొంగచేత కాల్చి చంపబడితే, అతని సినిమాలు మళ్ళీ టీవిలో ప్రసారం చేయబడతాయి. మరణించినా నేను మళ్ళీ ప్రేక్షకుల హృదయాల్లో జీవిస్తాను.’’
బ్రెట్ వెక్కివెక్కి ఏడుస్తూ అర్ధించాడు.
‘‘చంపు. ఈ జీవచ్ఛవాన్ని చంపి పుణ్యం కట్టుకో.’’
ఆ యువకుడు తల అడ్డంగా ఊపుతూ ఆశ్చర్యంగా చూసాడు.
‘‘నన్ను చంపు అని బతిమాలేవాళ్ళు పిచ్చివాళ్ళు. నీకు పిచ్చెక్కింది.’’
‘‘ప్లీజ్! నన్ను చంపు.’’
‘‘నాకు అర్థమైంది. టేప్ రికార్డర్‌ని ఆన్ చేసావా? ఇందాక బల్ల సొరుగు తెరిచినప్పుడు అది ఆన్ చేసావా?’’
‘‘లేదు. వచ్చి చూడు. సొరుగులో టేప్ రికార్డర్ లేదు. ఫోన్ రిసీవర్ కూడా క్రెడిల్ మీదే ఉంది.’’
‘‘దాచిన మైక్రోఫోన్‌లు ఈ గదిలో ఉన్నాయేమో?’’
‘‘ఉన్నా నీ కంఠ ధ్వనినిబట్టి వారు నిన్ను పట్టుకోలేరు.’’
‘‘నేను సాధారణ దొంగని. ఇంతదాకా ఎవర్నీ చంపలేదు. ఇంతదాకా ఎవరూ లేని ఇళ్ళల్లో నేను దొంగతనం చేసినప్పుడు నాకు సాక్షులు తారసపడలేదు. ఇవాళ మీకు దుర్దినం డేడ్. మీరు సహజంగానే మరణించాలి. నిన్ను చంపి నా తలని నేను రిస్క్ చేయదలచుకోలేదు. నీలాంటి గొప్ప నటుడ్ని చంపితే పోలీసులు నన్ను పట్టుకునేదాకా వదలరు.’’
అతను తక్షణం తను ఏ కిటికీలోంచి ఆ గదిలోకి ప్రవేశించాడో అదే కిటికీలోంచి బయటికి దూకి పారిపోయాడు.
బ్రెట్ డిలేన్ కొద్ది క్షణాలు గట్టిగా ఊపిరితీసుకుని వదిలాడు. తర్వాత సొరుగులోంచి పిస్తోలుని తీసి తయారుగా పట్టుకున్నాడు. మనసు మార్చుకుని వస్తే, రెండోసారి ఆ యువకుడికి అవకాశం ఇవ్వదలచుకోలేదు. తర్వాత రిసీవర్ అందుకుని ఓ నంబర్ తిప్పి చెప్పాడు.
‘‘సారీ! మీ అమ్మ వండిన కూరలోని మసాలా ఎంత గాఢంగా ఉందంటే నేను అల్సర్ మందుకోసం ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది. మనింట్లో దొంగపడ్డాడు. నేను వాడి ముందు ఎంత గొప్పగా నటించానో రిపోర్టర్స్‌కి జరిగింది చెప్పేప్పుడు నువ్వు విందువు గాని. వెంటనే బయలుదేరిరా... నేను స్నానంచేసి మంచి దుస్తులు ధరించాలి. వాళ్ళు నన్ను చిత్రీకరిస్తారు. ఫొటోలు కూడా తీస్తారు.’’
బ్రెట్ డిలేన్ రిసీవర్‌ని పెట్టేసాడు.
                                                                  - (లియో ఆర్ ఎల్లిస్ రచనకి స్వేచ్ఛానువాదం)

21, అక్టోబర్ 2011, శుక్రవారం

అద్వానీ యాత్రపై ఆర్‌ఎస్‌ఎస్ అసహనం!

చెక్ పెట్టేందుకు సన్నద్ధం



న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ప్రకటించిన రోజు నుంచి వివాదంగా మారి తమ మధ్య ఘర్షణకు  దారితీస్తూ సాగిపోతున్న బిజెపి అగ్రనేత అద్వానీ జన చేతన యాత్రపై రాష్ట్రీయ  స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) తీవ్ర అసహనంతో ఉంది. తమకిచ్చిన హామీకి విరుద్ధంగా  ప్రధానమంత్రి పదవిపై పూటకొక మాట మార్చటమే కాక పార్టీ ప్రయోజనాల కంటే తన వ్యక్తిగత  ప్రతిష్టను పెంచుకునే వేదికగా అద్వానీ యాత్ర జరుగుతోందని సంఘ్ భావిస్తోంది. ఈ  ప్రక్రియకు చెక్ పెట్టే దిశలో తన కార్యకర్తలకే కాక బిజెపికి చెందిన సీనియర్  నాయకులకు కూడా వ్యవహరించవలసిన తీరుతెన్నులను ఖరారు చేసింది. విశ్వసనీయ వర్గాల కథనం  ప్రకారం అద్వానీ యాత్రలో ఆయన కుమార్తె ప్రతిభతో పాటు ఆయనకు అత్యంత నమ్మకస్థులైన  పార్టీ ప్రధాన కార్యదర్శి అనంతకుమార్, పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రవి శంకర్  ప్రసాద్, స్వదేశీ జాగరణ్ మంచ్‌కి చెందిన మురళీధర్‌రావు కీలక పాత్ర వహిస్తున్నారు.  వీరిలో మురళీధర్‌రావు మాత్రమే సంఘ్ మనిషి. యాత్ర సాగేచోట స్థానిక నాయకులు, రాష్ట్ర  శాఖల నాయకులు అద్వానీని అనుసరిస్తున్నారు. అయితే అద్వానీ ప్రయాణం చేస్తున్న రథంపై  ఆయనతో పాటు కుమార్తె ప్రతిభ, యాత్ర కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న అనంతకుమార్‌లకు  తప్పించి స్థానిక నాయకులకు స్థానం లభించకపోవటం, స్థానికులకు మాట్లాడే అవకాశం  ఇవ్వకపోవటం వంటి అంశాలను సంఘ్ తీవ్రంగా పరిగణిస్తోందని చెబుతున్నారు. ఇది ఒక  ఎత్తయితే ప్రధాన మంత్రి పదవి రేసులో తాను లేననీ, ఉండబోనని కరాఖండిగా ప్రతిచోట  చెప్పవలసిందిగా యాత్ర ప్రారంభానికి ముందే సంఘ్ అద్వానీకి స్పష్టం చేసింది. తాము  విధించిన ఈ షరతుకు అంగీకరిస్తేనే స్వయం సేవకలు యాత్రను విజయవంతం చేయటానికి  సహకరిస్తారని ఆర్‌ఎస్‌ఎస్ తేల్చిచెప్పింది. అయితే అద్వానీ ఇప్పటివరకు పూర్తయిన  రథయాత్రలో ప్రధానమంత్రి పదవిపై ఆర్‌ఎస్‌ఎస్ ఆదేశాలను ఖాతరు చేయటం లేదు. పార్టీయే  తుది నిర్ణయం తీసుకుంటుందని ఒకసారి, ఆరోగ్యం అనుమతిస్తే అప్పుడు ఆలోచిస్తానని  మరోసారి బాణి మార్చటాన్ని సంఘ్ తీవ్రంగా పరిగణిస్తోంది. అద్వానీ వ్యవహరిస్తున్న  తీరును అదుపుచేయని పక్షంలో రానున్న కాలంలో పార్టీపై తీవ్ర ప్రభావం చూపించే అస్కారం  ఉందని భావిస్తోంది. ఈ తిరుగుబాటు ధోరణిని ఆదిలోనే తుంచి వేసే చర్యలకు సంఘ్  ఉపక్రమించింది. ఇంతకుముందు తీసుకున్న నిర్ణయం మేరకు జాతీయ స్థాయిలోని ప్రముఖ  నాయకులు తమ నియోజకవర్గాలు, రాష్ట్రాలతో నిమిత్తం లేకుండా అద్వానీ యాత్రలో  పాల్గొనవలసి ఉంది. అయితే ఇప్పుడు ఇద్దరు ప్రతిపక్ష నాయకులు సైతం అద్వానీ యాత్రకు  డుమ్మా కొట్టే అవకాశాలున్నాయి. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గత  ఎన్నికలలో మధ్యప్రదేశ్ నుంచి గెలిచినందున అద్వానీ యాత్రలో పాల్గొన్నారు. రాజ్యసభ  ప్రతిపక్ష నాయకుడు పంజాబ్, జమ్మూ, హిమాచల్ ప్రదేశ్‌లో జరిగే ర్యాలీలలో పాల్గొంటారు.  పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ ఆ రాష్ట్రంలో భాగస్వామ్య పక్షం అధినేతగా  యాత్రలో పాల్గొంటారు. తమ కూటమి లేదా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో  ముఖ్యమంత్రులు యాత్రలో పాలుపంచుకుంటారని తెలిసింది.

ముఖ్య కథనాలు,వార్తలు




దట్స్ తెలుగు


తెలంగాణకు కౌంట్డౌన్ ప్రారంభం: టిజి వెంకటేష్
దట్స్ తెలుగు
కర్నూలు/న్యూఢిల్లీ: తెలంగాణ సమస్యకు కేంద్రం కౌంట్ డౌన్ ప్రారంభించిందని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ గురువారం అన్నారు. కేంద్రం తెలంగాణ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తోందని ఈ రోజు నుండి కౌంట్ డౌన్ ప్రారంభించిందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే ...

ఇంకా మరిన్ని »



TV5


బెంగళూరులో జయ అక్రమాస్తుల కేసు విచారణ
TV5
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కేసు విచారణ నేటికి వాయిదా పడింది. నిన్న రాచఠీవితో బెంగళూరుకు చేరుకున్న జయ.. కోర్టు విచారణకు హాజరయ్యారు. సుమారు ఆరుగంటల పాటు విచారణ ఎదుర్కొన్న ఆమె.. విచారణ వాయిదా పడడంతో రాత్రి చెన్నై వెళ్లారు. మళ్లీ ఇవాళ బెంగళూరుకు ...
రెండోరోజు బెంగళూరుకు జయలలితసాక్షి
అక్రమ ఆస్తుల కేసు.... తొలిసారి బోనెక్కిన జయ!విశాలాంధ్ర
బోనెక్కిన జయలలితప్రజాశక్తి
దట్స్ తెలుగు
అన్ని 13 వార్తల కథనాలు »



దట్స్ తెలుగు


సీఎం సభలో ఎమ్మెల్యే 'కాపు' గళం
సాక్షి
అనంతపురం : అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభలో రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సమస్యలపై గళం విప్పారు. ముఖ్యమంత్రి పాల్గొన్న సభలో ఆయన మాట్లాడుతు తమ నియోజకవర్గానికి ఉన్న సమస్యలు మరెవ్వరికీ లేవని సర్కార్ వైఖరిని ఎత్తి చూపారు. ...
సిఎం సభలో ప్రభుత్వంపై ఎమ్మెల్యే కాపు విమర్శదట్స్ తెలుగు

అన్ని 2 వార్తల కథనాలు »

<br>నేనొస్తున్నానని ధర పెంచారు: వైయస్ జగన్ - దట్స్ తెలుగు<br>


దట్స్ తెలుగు


నేనొస్తున్నానని ధర పెంచారు: వైయస్ జగన్
దట్స్ తెలుగు
గుంటూరు: తాను పసుపు రైతులను పరామర్శించడానికి వస్తున్నాననే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం పసుపుకు రూ. వెయ్యి పెంచిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం గుంటూరు జిల్లాలో అన్నారు. జిల్లాలో జరుగుతున్న ...
పసుపుకు మద్దతు ధర ప్రకటించాలి: జగన్సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »



సాక్షి


1నుంచి ఆమరణ దీక్ష దీక్షను అడ్డుకుంటే ఆత్మబలిదానం చేసుకుంటా ...
Vaartha Telugu news portal
నల్లగొండ, అక్టోబరు 20, ప్రభాతవార్త ప్రతినిధి: నాలు గున్నరకోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ.. ఆ తెలం గాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం కోసం నవం బరు ఒకటవతేదీ నుండి ఆమరణ దీక్ష చేపడ తానని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టంచేశారు. ఇది ఆవేశంతో తీసుకున్న ...
1 నుండి ఆమరణ నిరాహార దీక్షవిశాలాంధ్ర
తెలంగాణ కోసం 1న ఆమరణదీక్షసాక్షి
ఆమరణ దీక్షలు - నిరసన కార్యక్రమాలుTV5

అన్ని 5 వార్తల కథనాలు »




దట్స్ తెలుగు


రాహుల్ అమేథీ పర్యటనలో కలకలం
సాక్షి
అమేథీ: కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ పర్యటనలో కలకలం రేగింది. ఒకరోజు పర్యటన కోసం అమేథీ వచ్చిన ఆయన.. ఓ సభలో ప్రసంగించాల్సి ఉంది. ఆ సభాస్థలి లోనికి తుపాకీతో వెళ్లడానికి ప్రయత్నించిన ప్రదీప్ కుమార్ సోనీ అనే యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ...
రాహుల్ కాన్వాయ్లోకి అపరిచితుడుTV5
రాహుల్ గాంధీ మీటింగ్ వద్ద రివాల్వర్ కలకలందట్స్ తెలుగు

అన్ని 4 వార్తల కథనాలు »





తెలుగువన్


పోలవరానికి రాజకీయ రంగు!
సాక్షి
టెండర్ దక్కించుకున్న కంపెనీ 'నమస్తే తెలంగాణ' పత్రిక సీఎండీది.. ఈ కంపెనీకి అనుభవం లేదన్న విమర్శలు హైదరాబాద్, న్యూస్లైన్: అటు తిరిగి ఇటు తిరిగి రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు పోలవరం చుట్టు పరిభ్రమిస్తున్నాయి! ఈ ప్రాజెక్టు విషయంలో టీడీపీ యూ టర్న్ తీసుకుంది. ...
పోలవరం: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాజుకున్న మంటదట్స్ తెలుగు
పోలవరం టెండర్లపై సరికొత్త వివాదంTV5

అన్ని 7 వార్తల కథనాలు »




TV5


అన్నా టీంను టార్గెట్ చేసుకున్న కాంగ్రెస్
TV5
లోక్పాల్ బిల్లు విషయంలో కేంద్రాన్ని ముప్పుతిప్పలు పెట్టి టీం అన్నా సభ్యులపై... ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అన్నా టీం సభ్యులైన శాంతిభూషణ్, ప్రశాంతి భూషణ్, అరవింద్ కేజ్రీవాల్ పైన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకులు తాజాగా.. కిరణ్ బేడీపై విమర్శలు ...
మరో వివాదంలో అన్నా బృందంవిశాలాంధ్ర
వివాదంలో కిరణ్ బేడిసాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »



దట్స్ తెలుగు


బెంగుళూరు మెట్రో రైలు ప్రారంభం
TV5
బెంగుళూరు ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. ఎన్నో ఏళ్లుగా కంటున్న కలలు నిజమయ్యాయి. ట్రాఫిక్ కష్టాలకు చెక్ చెబుతూ మెట్రో రైలు రయ్మంటూ దూసుకొచ్చింది. ఎంజి రోడ్డు నుంచి బయ్యప్పనహళ్ళి మధ్య తిరిగే మెట్రో రైలును కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కమలనాథ్ ...
బెంగుళూరు 'నమ్మ మెట్రో'లో ఇంటర్నెట్.. ఫ్రీ.. ఫ్రీదట్స్ తెలుగు
నెరవేరిన బెంగళూరు వాసుల కలసాక్షి
బెంగళూరులో మెట్రోరైలు పరుగులుప్రజాశక్తి

అన్ని 7 వార్తల కథనాలు »



సాక్షి


ముగిసిన మరో నియంత చరిత్ర సాయుధ దళాల కాల్పుల్లో నేలకొరిగిన గడాఫీ
Vaartha Telugu news portal
సిర్టే, అక్టోబరు 20 : లిబియాను నాలుగు దశా బ్దాల పాటు పాలించిన నియంత మోమర్ గడాఫీ చరిత్రలో చివరి రోజు నమోదైంది. గురువారం గడాఫీని ఆయన సొంత నగరమైన సిర్టేలో సాయుధ దళాలు ఆయన్ని కాల్చి చం పాయి. అనేక మందిని శాసించిన గడాఫీ కంఠం నుంచి ''కాల్చవద్దు, కాల్చ వద్దు అని చివరి ...
గడాఫీ హత్యప్రజాశక్తి
గడాఫీ హతంసాక్షి
నాటో కాల్పుల్లో లిబియా నియంత గడాఫీ హతం?దట్స్ తెలుగు

అన్ని 9 వార్తల కథనాలు »





దట్స్ తెలుగు


సిఎం, బొత్స ఛలో ఢిల్లీ: కాంగ్రెసు నేతల హస్తిన దారి
దట్స్ తెలుగు
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెసు రాజకీయంతో హస్తిన మరోసారి వేడెక్కనుంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శుక్రవారం సాయంత్రం ఢిల్లీ బాట పట్టనున్నారు. రైలు రోకోలో పాల్గొన్న తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు ...

ఇంకా మరిన్ని »
</span><span class="text">సీఎం సభలో ఎమ్మెల్యే 'కాపు' గళం - సాక్షి</span><span class="webkit-html-tag">



దట్స్ తెలుగు


సీఎం సభలో ఎమ్మెల్యే 'కాపు' గళం
సాక్షి
అనంతపురం : అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభలో రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సమస్యలపై గళం విప్పారు. ముఖ్యమంత్రి పాల్గొన్న సభలో ఆయన మాట్లాడుతు తమ నియోజకవర్గానికి ఉన్న సమస్యలు మరెవ్వరికీ లేవని సర్కార్ వైఖరిని ఎత్తి చూపారు. ...
సిఎం సభలో ప్రభుత్వంపై ఎమ్మెల్యే కాపు విమర్శదట్స్ తెలుగు

అన్ని 2 వార్తల కథనాలు »
</span></div><div class="collapsible-content" style="margin-left: 1em; "><span class="text">నేనొస్తున్నానని ధర పెంచారు: వైయస్ జగన్ - దట్స్ తెలుగు</span></div><div class="line"><span class="webkit-html-tag">



దట్స్ తెలుగు


నేనొస్తున్నానని ధర పెంచారు: వైయస్ జగన్
దట్స్ తెలుగు
గుంటూరు: తాను పసుపు రైతులను పరామర్శించడానికి వస్తున్నాననే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం పసుపుకు రూ. వెయ్యి పెంచిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం గుంటూరు జిల్లాలో అన్నారు. జిల్లాలో జరుగుతున్న ...
పసుపుకు మద్దతు ధర ప్రకటించాలి: జగన్సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »
</span></div><div class="collapsible-content" style="margin-left: 1em; "><span class="text">1నుంచి ఆమరణ దీక్ష దీక్షను అడ్డుకుంటే ఆత్మబలిదానం చేసుకుంటా ... - Vaartha Telugu news portal</span></div><div class="line"><span class="webkit-html-tag">



సాక్షి


1నుంచి ఆమరణ దీక్ష దీక్షను అడ్డుకుంటే ఆత్మబలిదానం చేసుకుంటా ...
Vaartha Telugu news portal
నల్లగొండ, అక్టోబరు 20, ప్రభాతవార్త ప్రతినిధి: నాలు గున్నరకోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ.. ఆ తెలం గాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం కోసం నవం బరు ఒకటవతేదీ నుండి ఆమరణ దీక్ష చేపడ తానని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టంచేశారు. ఇది ఆవేశంతో తీసుకున్న ...
1 నుండి ఆమరణ నిరాహార దీక్షవిశాలాంధ్ర
తెలంగాణ కోసం 1న ఆమరణదీక్షసాక్షి
ఆమరణ దీక్షలు - నిరసన కార్యక్రమాలుTV5

అన్ని 5 వార్తల కథనాలు »
</span><span class="text">పోలవరానికి రాజకీయ రంగు! - సాక్షి</span><span class="webkit-html-tag">



తెలుగువన్


పోలవరానికి రాజకీయ రంగు!
సాక్షి
టెండర్ దక్కించుకున్న కంపెనీ 'నమస్తే తెలంగాణ' పత్రిక సీఎండీది.. ఈ కంపెనీకి అనుభవం లేదన్న విమర్శలు హైదరాబాద్, న్యూస్లైన్: అటు తిరిగి ఇటు తిరిగి రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు పోలవరం చుట్టు పరిభ్రమిస్తున్నాయి! ఈ ప్రాజెక్టు విషయంలో టీడీపీ యూ టర్న్ తీసుకుంది. ...
పోలవరం: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాజుకున్న మంటదట్స్ తెలుగు
పోలవరం టెండర్లపై సరికొత్త వివాదంTV5

అన్ని 7 వార్తల కథనాలు »
</span></div><div class="collapsible-content" style="margin-left: 1em; "><span class="text">తెలంగాణకు కౌంట్డౌన్ ప్రారంభం: టిజి వెంకటేష్ - దట్స్ తెలుగు</span></div><div class="line"><span class="webkit-html-tag">



దట్స్ తెలుగు


తెలంగాణకు కౌంట్డౌన్ ప్రారంభం: టిజి వెంకటేష్
దట్స్ తెలుగు
కర్నూలు/న్యూఢిల్లీ: తెలంగాణ సమస్యకు కేంద్రం కౌంట్ డౌన్ ప్రారంభించిందని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ గురువారం అన్నారు. కేంద్రం తెలంగాణ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తోందని ఈ రోజు నుండి కౌంట్ డౌన్ ప్రారంభించిందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే ...

ఇంకా మరిన్ని »
</span></div><div class="collapsible-content" style="margin-left: 1em; "><span class="text">సెటిలర్స్ పైన టిఆర్ఎస్ వైఖరి మారుతోందా? - దట్స్ తెలుగు</span></div><div class="line"><span class="webkit-html-tag">



దట్స్ తెలుగు


సెటిలర్స్ పైన టిఆర్ఎస్ వైఖరి మారుతోందా?
దట్స్ తెలుగు
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో ఉన్న సెటిలర్స్ పైన తెలంగాణ రాష్ట్ర సమితి వైఖరి క్రమంగా మారుతోందా అంటే అవునని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పలువురు. తెలంగాణలో ఉన్న సెటిలర్స్ తమ సోదరులే అని ప్రత్యేక రాష్ట్రం వచ్చాక వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పే తెరాస ...
'పోచారం తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి'సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »
</span><span class="text">గుంటూరు జిల్లాలో జోరుగా ఓదార్పు యాత్ర - TV5</span><span class="webkit-html-tag">



TV5


గుంటూరు జిల్లాలో జోరుగా ఓదార్పు యాత్ర
TV5
వైఎస్సార్ పార్టీ అధికారంలోకి వస్తే... అన్నదాతలకు స్వర్ణయగం వస్తుందని జగన్ అన్నారు. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. గుంటూరు జిల్లాలో జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర ఐదోరోజు విజయవంతంగా సాగింది. పెదపాలెం నుంచి ప్రారంభమైన యాత్ర ...
దుగ్గిరాల నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభంసాక్షి
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలో అపశృతిదట్స్ తెలుగు

అన్ని 25 వార్తల కథనాలు »
</span><span class="text">ఘనంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం - TV5</span><span class="webkit-html-tag">



TV5


ఘనంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం
TV5
నిజామాబాద్ జిల్లాలో పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. పోలీస్ పరెడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ వరప్రసాద్,ఎస్పి రామకృష్ణయ్యలు అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొన్నారు. అమరులైన పోలీస్ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహాయసహకారాలు ఉంటాయని ...
పోలీస్ సంక్షేమ నిధికి రూ.కోటి: హోంమంత్రిసాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »
</span></div><div class="collapsible-content" style="margin-left: 1em; "><span class="text">కోదండరామ్, స్వామిగౌడ్పై చర్యలుండవు: శైలజానాథ్ - దట్స్ తెలుగు</span></div><div class="line"><span class="webkit-html-tag">



దట్స్ తెలుగు


కోదండరామ్, స్వామిగౌడ్పై చర్యలుండవు: శైలజానాథ్
దట్స్ తెలుగు
అనంతపురం: తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్, తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత స్వామి గౌడ్ పైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోక పోవచ్చునని మంత్రి శైలజానాథ్ శుక్రవారం అనంతపురం జిల్లాలో అభిప్రాయపడ్డారు. వారు వెంటనే సమ్మె విరమణకు కృషి ...

ఇంకా మరిన్ని »

</span><span class="text">వినోదం - Google వార్తలు</span><span class="webkit-html-tag">




అక్కడ మహేష్ బాబు...శర్వానంద్
దట్స్ తెలుగు
ఇప్పుడు తమిళంలో హాట్ టాపిక్ ఏమిటా అంటే శర్వానంద్ నటించిన తాజా చిత్రం న 'ఎంగేయుమ్ ఎప్పోదుమ్' కలెక్షన్స్. ఆ చిత్రం దాదాపు నలభై కోట్లు వరకూ కలెక్టు చేసిందని,అదీ ముప్పై రోజుల్లో చెప్పుకుంటున్నారు. దాదాపు 150 ధియోటర్స్ లో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే హిట్ టాక్ ...
డబ్బింగ్లో 'జర్నీ'ప్రజాశక్తి
రెండు జంటల ప్రేమ ప్రయాణంVaartha Telugu news portal

అన్ని 3 వార్తల కథనాలు »
</span><span class="text">పనోరమకు ఎంపికైన విరోధి సినిమా - TV5</span><span class="webkit-html-tag">



TV5


పనోరమకు ఎంపికైన విరోధి సినిమా
TV5
నీలకంఠ దక్శకత్వంలో శ్రీకాంత్ నటించిన విరోధి చిత్రం పనోరమ నేషనల్ అవార్డ్ పోటీలకు ఎంపికయ్యింది.ఈ చిత్రోత్సవంతో మొత్తం 24 భారతీయ చిత్రాలు ఎంపిక అయ్యాయి.గోవాలో జరిగే ఈ చిత్రోత్సవంలో ఈనెల 23 వతేదీన విరోధి చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ ...
ఇండియన్ పనోరమాకు విరోధిసాక్షి
పనోరమా 2011 ఎంపికైన ఏకైక తెలుగు సినిమాదట్స్ తెలుగు

అన్ని 3 వార్తల కథనాలు »

</span></div><div class="collapsible-content" style="margin-left: 1em; "><span class="text">చిన్ని కృష్ణ దర్శకత్వంలో సునీల్ ఖరారు - దట్స్ తెలుగు</span></div><div class="line"><span class="webkit-html-tag">



విశాలాంధ్ర


చిన్ని కృష్ణ దర్శకత్వంలో సునీల్ ఖరారు
దట్స్ తెలుగు
నా తదుపరి చిత్రం బి చిన్ని కృష్ణ దర్శకత్వం చేయబోతున్నాను.పూల రంగడు అనంతరం ఈ చిత్రం తెరకెక్కుతుంది.పెద్ద నిర్మాణ సంస్ధ ఈ చిత్రం నిర్మిస్తుంది అన్నారు సునీల్ ఓ ప్రెస్ మీట్ లో. ఇంతకీ చిన్ని కృష్ణ అంటే స్టార్ రైటర్ చిన్న కృష్ణ కాదు. నిఖిల్ తో వీడు తేడా చిత్రం ...
సునీల్తో చిన్నికృష్ణ చిత్రంవిశాలాంధ్ర
సునీల్ హీరోగా భారీ చిత్రంప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »

</span><span class="text">ఆశ్చర్యపరిచే వెన్నెల సీక్వెల్ - సాక్షి</span><span class="webkit-html-tag">



సాక్షి


ఆశ్చర్యపరిచే వెన్నెల సీక్వెల్
సాక్షి
'వెన్నెల' చిత్రం ద్వారా నటుడిగా పరిచయమై, అనంతరం వరుసగా సినిమాలు చేస్తూ హాస్యనటునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు 'వెన్నెల' కిశోర్. ఏ చిత్రం అయితే తన ఇంటి పేరుగా మారిందో ఇప్పుడు అదే చిత్రం సీక్వెల్కి దర్శకత్వం వహిస్తున్నారాయన. ఈ సీక్వెల్కి 'వెన్నెల 1 1/2' అనే ...
డిసెంబర్లో 'వెన్నెల 1 1/2'విశాలాంధ్ర
విదేశాలను చుట్టిన 'వెన్నెల1 1/2'ప్రజాశక్తి

అన్ని 3 వార్తల కథనాలు »

</span></div><div class="collapsible-content" style="margin-left: 1em; "><span class="text">స్టైలిష్ దర్శకుడుతో అల్లు అర్జున్ నెక్స్ట్ ఖరారు - దట్స్ తెలుగు</span></div><div class="line"><span class="webkit-html-tag">



TV5


స్టైలిష్ దర్శకుడుతో అల్లు అర్జున్ నెక్స్ట్ ఖరారు
దట్స్ తెలుగు
రీసెంట్ గా ఊసరవెల్లి చిత్రంతో పలకరించిన స్టైలిష్ దర్శకుడు సురేంద్రరెడ్డి తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్ తో చేయబోతున్నారు. ఆర్.ఆర్.మూవీమేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మించనున్న ఈ చిత్రానికి సురేందర్రెడ్డి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ...
సురేందర్రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »
</span><span class="text">ఖైదీ రీమేక్ విషయమై పూరీ జగన్నాధ్ - దట్స్ తెలుగు</span><span class="webkit-html-tag">



దట్స్ తెలుగు


ఖైదీ రీమేక్ విషయమై పూరీ జగన్నాధ్
దట్స్ తెలుగు
రెండు రోజుల క్రితం మహేష్ బాబు, దర్శకుడు పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో ఖైదీ చిత్రం రీమేక్ రానుందంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసి సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇది విన్న వారంతా వర్మ కావాలనే చిరంజీవి కెలకటానికి చేసిన పని అనుకున్నారు.అయితే పూరీ ఈ చిత్రం ...
మహేష్ ముందు చిరు నథింగ్ : వర్మవిశాలాంధ్ర

అన్ని 6 వార్తల కథనాలు »
</span><span class="text">కొత్త కొత్త స్టెప్పులు కావాలంట... - ప్రజాశక్తి</span><span class="webkit-html-tag">



దట్స్ తెలుగు


కొత్త కొత్త స్టెప్పులు కావాలంట...
ప్రజాశక్తి
తెలుగు, తమిళ, కన్నడ, మళయాళం చిత్రాలలో 450కి పైగా పాటలకు నృత్యాలను కంపోజ్ చేసిన డ్యాన్స్మాస్టర్ అశోక్రాజా. ఈయన తాజాగా తమిళంలో జయం రవి దర్శకత్వంలో విజరు హీరోగా రూపొందిన 'వేలాయుధం' చిత్రానికి నృత్య రీతుల్ని అందించారు. ఈ సంధర్భంగా ఆయన చెన్నయ్ లో విలేకరులతో తన ...
అల్లు అర్జున్ డ్రీమ్ ప్రాజెక్ట్ కోరిక ఎప్పటికి తీరేనూ...!?దట్స్ తెలుగు

అన్ని 2 వార్తల కథనాలు »
</span></div><div class="collapsible-content" style="margin-left: 1em; "><span class="text">75కిలోల బెల్లంతో తులాభారం సమర్పించిన సూపర్ స్టార్...! - దట్స్ తెలుగు</span></div><div class="line"><span class="webkit-html-tag">


TV5


75కిలోల బెల్లంతో తులాభారం సమర్పించిన సూపర్ స్టార్...!
దట్స్ తెలుగు
తనకు అనారోగ్యం కలిగినప్పుడు పెట్టుకున్న మొక్కును తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నిన్న తిరుమల వెళ్ళి మొక్కు తీర్చుకున్నారు. తన మిత్రుడు, నటుడు మోహన్ బాబు, కుటుంబ సభ్యులతో కలిసి రజనీ వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారికి తులాభారంగా 75 ...
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రజనీకాంత్TV5

అన్ని 4 వార్తల కథనాలు »
</span></div><div class="collapsible-content" style="margin-left: 1em; "><span class="text">బచ్చన్ హౌస్ జాల్సాలో ఐష్ శ్రీమంతపు వేడుకలు..! - దట్స్ తెలుగు</span></div><div class="line"><span class="webkit-html-tag">




బచ్చన్ హౌస్ జాల్సాలో ఐష్ శ్రీమంతపు వేడుకలు..!
దట్స్ తెలుగు
ఐష్ ప్రెగ్నెన్సీ అయిన దగ్గరనుంచీ బిగ్ బీ ఫ్యామిలీ ఆనందోత్సాహాల్లో మునిగితేలుతుంది. అభిషేక్ ఐతే ఇక తన వైఫ్ ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఇంకో నెల రోజుల్లో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్న ఐష్ కు తన అత్తగారు జయాబచ్చన్ సీమంతం వేడుకను ఫుల్ గ్రాండ్ గా ...

ఇంకా మరిన్ని »
</span><span class="text">కర్నూల్లో భారీ అగ్నిప్రమాదం - TV5</span><span class="webkit-html-tag">



TV5


కర్నూల్లో భారీ అగ్నిప్రమాదం
TV5
కర్నూల్లోని భూపాల్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న MRS టైర్ల దుకాణంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మంటలు తీవ్రస్థాయిలో వెలువడి పక్కనున్న రేఖా గార్మెంట్స్, కుమార్ షర్ట్స్.. బట్టల దుకాణాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకునే లోపే ...
కర్నూలులో భారీ అగ్నిప్రమాదంసాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »